Congress: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం కేరళ రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. ఈ వివాదంపై ఇటు అధికార సీపీఎంతో పాటు కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా పాలస్తీనా కోసం సంఘీభావ ర్యాలీలు చేస్తున్నాయి. ఉగ్రదాడికి గురైన ఇజ్రాయిల్‌కి మద్దతు తెలుపకపోగా పాలస్తీనా, హమాస్‌కి మద్దతుగా ర్యాలీలు ఏంటని బీజేపీ ప్రశ్నిస్తోంది.
UNESCO: వరల్డ్ సిటీస్ డే రోజున దేశంలోని కోజికోడ్, గ్వాలియర్ నగరాలకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మక యునెస్కో క్రియెటివ్ సిటీస్ నెట్వర్క్‌లో చోటు లభించింది. 55 కొత్త నగరాల జాబితాలో ఈ రెండు నగరాలకు చోటు లభించింది. ఐక్యరాజ్యసమితి మంగళవారం ఈ జాబితాను విదుదల చేసింది. జాబితాలో భారతీయ నగరాలు చోటు సంపాదించుకోవడం గర్వకారణమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సంస్కృతి, సృజనాత్మకతను ఉపయోగించుకోవడంలో ఈ నగరాలు నిబద్ధతను కలిగి ఉన్నాయని ఆయన అన్నారు.
కేరళలోని కోజికోడ్ జిల్లాలో శుక్రవారం నిపా వైరస్ సోకిన మరో కేసు నిర్ధారించారు. ఓ 39ఏళ్ల వ్యక్తికి నిపా వైరస్ సోకినట్లు నిర్ధారించినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ కార్యాలయం శుక్రవారం తెలిపింది.
Kerala: కేరళలో సంచలనం సృష్టించిన హోటల్ యజమాని హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సెక్స్ స్కాండర్, హనీట్రాప్ ఈ కేసులో ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. కోజికోడ్ కు చెందిన వ్యాపారి హత్య కేసులో ముగ్గురు నిందితులుగా ఉన్నారు. నిందితులు శిబిలి, ఫర్హానా, ఆషిక్ లు ముగ్గురు 58 ఏళ్ సిద్ధిక్ ను హనీట్రాప్ చేసేందుకు కుట్ర చేశారు
Kerala Train Attack: కేరళ ట్రైన్ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ట్రైన్ లో నిప్పంటించి ముగ్గురు మరణాలకు కారణం అయిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడిలో ఉగ్రవాద కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడు షారుఖ్ సైఫీని మహారాష్ట్రలోని రత్నగిరి రైల్వే స్టేషన్ లో నిన్న రాత్రి పట్టుకున్నారు. మహరాష్ట్ర పోలీసులు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ జాయింట్ ఆపరేషన్ లో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు.
అబుదాబి నుంచి కోజికోడ్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం టేకాఫ్ అయిన వెంటనే ఇంజన్‌లలో ఒకదానిలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు.
Reliance Jio True 5G:5 జీ సేవల్లో దూకుడు చూపిస్తోంది రిలయన్స్ జియో.. ఇవాళ దేశవ్యాప్తంగా మరో 10 నగరాల్లో ట్రూ 5జీ సేవలను ప్రారంభించింది.. ఏపీలోని తిరుపతి, నెల్లూరు పట్టణాల్లో సోమవారం లాంఛనంగా తన సేవలను ప్రారంభించింది. ఇప్పటికే తిరుమల, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు పట్టణాల్లో రిలయన్స్ జియో తన ట్రూ 5జీ సేవలను లాంచ్ చేసిన విషయం విదితమే కాగా.. ఇవాళ మరో రెండు నగరాలకు విస్తరించింది.. ఇక, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా, కాన్పూర్, మీరట్,…
Snake In Train: ఇటీవల కాలంలో టర్కీకి చెందిన ఓ విమాన సంస్థ ఆహారంలో పాము తలకాయ వచ్చిందనే వార్తలు చూశాం. ఈ వార్త తెగ వైరల్ అయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మన ఇండియాలో ఓ పాము రైల్ లో దూరింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎంత వెతికినా.. పాము కనిపించకపోవడంతో బిక్కుబిక్కు మంటూ ప్రయాణం చేయాల్సి వచ్చింది.
అసలే కరోనా సమయం.. ఏ కొత్త వైరస్ వెలుగు చూసినా.. అది కరోనా వేరియెంటేనా? అని అనుమానంగా చూడాల్సిన పరిస్థితి.. అయితే, కేరళలో మరోసారి షిగెల్లా కేసు బయటపడింది.. కోజికోడ్‌లోని పుత్తియప్పలో ఏడేళ్ల బాలికకు ఈ వ్యాధి సోకినట్టు గుర్తించారు అధికారులు.. ఏప్రిల్27వ తేదీన కేసు నమోదైందని, ఇప్పటి వరకు ఎవరికీ వ్యాపించిన దాఖలాలు లేవంటున్నారు అధికారులు.. ఈ నెల 20వ తేదీన చిన్నారిలో షిగెల్లా లక్షణాలు కనిపించడంతో.. పరీక్ష నిర్వహిస్తే పాజిటివ్‌గా తేలనడంతో స్థానికులు ఆందోళనకు…