హైదరాబాద్‌లోని కోఠి మహిళా కళాశాలలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కోఠి మహిళా విశ్వవిద్యాలయాన్ని యూజీసీలో చేర్చాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా విశ్వవిద్యాలయంగా నామకరణం చేసిందని.. కానీ ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదన్నారు.
శతాబ్దపు ఘన చరిత్ర కలిగిన కోఠి ఉమెన్స్ కాలేజ్ కు మహిళా విశ్వ విద్యాలయం హోదా త్వరలోనే దక్కనుంది. దీని కోసం గతంలోనూ కేసీఆర్ సర్కార్ ప్రయత్నాలు చేయగా… కార్యరూపం దాల్చలేదు. కానీ.. ఈ విడత సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ నుంచి ఈ ప్రతిపాదన రావడంతో కోఠి ఉమెన్స్ కాలేజీ యూనివర్సిటీ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి వర్గ ఉప సంఘం సమావేశంలో కేటీఆర్ తాజాగా కోఠి మహిళా యూనివర్సిటీ ప్రతిపాదనను చర్చకు…