శతాధిక కథాచిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనులు తెలుగునాటనే అధికంగా ఉండడం విశేషం. వారిలో యాక్షన్ మూవీస్ తో అధికంగా మురిపించిన కె.ఎస్.ఆర్.దాస్ స్థానం ప్రత్యేకమైనది. చిత్రసీమలోని 24 శాఖలలో పట్టున్న దర్శకులు అరుదుగా కనిపిస్తారు. కె.ఎస్.ఆర్. దాస్ అన్ని శాఖల్లోనూ పట్టు సాధించాకే ‘లోగుట్టు పెరుమాళ్ళ కెరుక’తో దర్శకుడయ్యారు. ఆపై ‘రాజయోగం’ చూడాలనుకున్నాడు ‘రాజసింహ’ తీశాడు. ‘గండరగండడు’ కాసింత కరుణించాడు. తరువాత ‘గందరగోళం’లో పడ్డాడు దాసు. ఆ సమయంలో కృష్ణ ద్విపాత్రాభినయంతో తెరకెక్కించిన ‘టక్కరి దొంగ –…