Komaravelli: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ ఆదివారం నుంచి 8 ఆదివారాల పాటు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి.
సిద్దిపేట జిల్లాలోని కొమురవెళ్లి మల్లికార్జున స్వామి వారిని పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకొని, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ హయాంలోనే రాష్ట్రంలోని ఆలయాలకు మహర్దశ వచ్చిందన్నారు. కొమురవెళ్లి మల్లన్న మా ఇంటి కులదైవం ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శించుకుంటామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఆలయాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన వెల్లడించారు. ఆలయం వద్ద భక్తులకు మెరుగైన వసతులు…
హైదరాబాద్ అబిడ్స్ బొగ్గులకుంట లోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించిన తెలంగాణ రాష్ట్ర ఒగ్గు బీర్ల కళాకారులు.మల్లన్న ఒగ్గు కథ చెబుతూ .. ఒగ్గు సంప్రదాయ పూజలు చేసి నిరసన తెలిపిన ఒగ్గు పూజారులు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఒగ్గు పూజారులను గర్భగుడి పూజల నుంచి బహిష్కరించడం దారుణమన్నారు. ఎన్నో ఏళ్లుగా పూజారులుగా కొనసాగుతున్న తమను తొలిగించి..వీర శైవ (బలిజ) పూజారులను కొనసాగించడంపై ఒగ్గుపూజారులు అభ్యంతరం వ్యక్తం…
ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాతరల సీజన్ మొదలైంది. ఇంటి ఇలవేల్పులకు మొక్క చెల్లించేందుకు పెద్దఎత్తున భక్తులు జాతరలకు వెళ్తుంటారు. కరోనా పెరుగుతున్న సమయంలో జరుగుతున్న ఈ జాతరల్లో ముందు జాగ్రత్తల పరిస్థితి ఏంటి? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. జనవరి మాసం వచ్చిందంటే చాలు వరంగల్ జిల్లాలో జాతర సీజన్ మొదలవుతుంది. ఐనవోలు మల్లికార్జున స్వామి జాతరతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా కొత్తకొండ, కొమురవెల్లి, మేడారం జాతరలు జరుగుతాయి. సంక్రాంతి నుంచి మొదలయ్యే జాతరలతో ఉమ్మడి…
సిద్ధిపేట జిల్లాలోని కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి వారి ఆలయంలో భక్తులతో రద్దీగా మారింది. నేటి నుంచి కొమురవెల్లి మల్లన్న దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. నేడు పట్నంవారంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కరోనా దృష్ట్యా అంతర్గతంగా అగ్నిగుండాలు, పెద్దపట్నం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి కొమురవెల్లి మల్లన్న దర్శనార్థం అధిక సంఖ్యలో భక్తులు ఆలయాని విచ్చేశారు. దీంతో స్వామి వారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. అయితే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్క్ ధరించకుంటే ఎవ్వరినీ…
సిద్ధిపేట జిల్లాలోని కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా స్వామి వారి కల్యాణోత్సవం కన్నుల పండువగా సాగింది. ప్రభుత్వం తరుపున స్వామి వారికి పట్టువస్త్రాలను ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు సమర్పించారు. ఈ కల్యాణోత్సవ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు కూడా హజరయ్యారు. మల్లన్న స్వామి కల్యాణోత్సవంతో నేటి నుంచి కొమురవెల్లిలో మల్లన్న…