సిద్దిపేట జిల్లాలో గవర్నర్ తమిళిసై పర్యటన కొనసాగుతుంది. కార్తీకమాసంలో మల్లికార్జున స్వామి వారిని గవర్నర్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు గవర్నర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తర్వాత మల్లికార్జున స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలని పూజలు చేశారు.