Talasani Srinivas Yadav: తెలంగాణలో హంగు, బొంగు ఏమీ రాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Talasani Srinivas Yadav Reacts On BRS Congress Alliance: తెలంగాణలో హంగు, బొంగు ఏమీ రాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో పొత్తు ఉండదని, వచ్చే ఎన్నికల్లో తాము పూర్తి మెజార్టీతో గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అయినా.. తాము పోయి పోయి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటమా? అయిన మాకు పొత్తు పెట్టుకునే అవసరం ఏముంది? అని తిరిగి ప్రశ్నించారు. తమతో పోటీ పడే వాళ్ళు తెలంగాణలో లేరని తేల్చి చెప్పారు. వామపక్షాలతో పొత్తుపై కేసీఆర్ మాట్లాడతారని అన్నారు. బీఆర్ఎస్ బండి ఫుల్ లోడ్ అయి ఉందన్నారు. సికింద్రాబాద్, అంబర్‌పేట్ పార్లమెంట్ నియోజకవర్గాలకు కిషన్ రెడ్డి ఏ నిధులు తీసుకొచ్చారో చెప్పాలని నిలదీశారు. అంబర్‌పేటలో అభివృద్ధి గురించి కిషన్‌రెడ్డితో చర్చించడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు వెంకటేశ్ సిద్ధంగా ఉంటారన్నారు. ఇక ఈటల బీఆర్ఎస్‌లోకి రావడంపై తానేం చెప్పలేనని, బీఆర్ఎస్‌లోకి ఎప్పుడొస్తారో ఈటలనే అడగండని అన్నారు.
Bare Foot Walking: చెప్పులు లేకుండా నడిచారా.. ఒకసారి ట్రైచేసి చూడండి
Also Read
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
- Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- South Central Railway : మౌలాలిలో రైళ్లకు బ్రేక్.. డీజిల్ ఇంజిన్లతో రంగంలోకి రైల్వే.!
కడపలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు ఈసీ అనుమతి ఇచ్చిందని.. కానీ తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభంకు అనుమతి ఇవ్వలేదని తలసాని మండిపడ్డారు. వ్యవస్థలు ఎటు పోతున్నాయని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఇటీవల సచివాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై వివరణ ఇచ్చారు. కార్మికులు చలి కాచుకునే సమయంలో ఆ ప్రమాదం చోటు చేసుకుందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్‌లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారని.. ఈ వేడుకల్ని బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో నిర్వహిస్తారని తలసాని స్పష్టం చేశారు. కాగా.. ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యాక తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని, అప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్‌తో చేతులు కలుపుతారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే! అందుకు బదులుగానే పై విధంగా తలసాని స్పందించారు.
ICC Rankings: టెస్టుల్లోనూ నెంబర్‌వన్.. కెప్టెన్‌గా రోహిత్ సరికొత్త చరిత్ర
తాజావార్తలు
-
Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
Boeing 737 MAX Software Glitch: Boeing 737 MAX విమానాల్లో కొత్త సాఫ్ట్వేర్ సమస్య.. ల్యాండింగ్ సమయంలో..
-
Iran Embassy Shares Baahubali Video: ‘తలవంచం.. మోకరిల్లం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ మెసేజ్. ప్రభాస్ ‘బాహుబలి’ వీడియో షేర్ చేసి..!
-
Supreme Court: “ఒక్క సెప్టెంబర్‌లోనే 13 అత్యాచారాలు”.. ఢిల్లీలో లైంగిక దాడులపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!