కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ పై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ కాల్ లో తన కుమారుడు చెరుకు సుహాస్ తో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయంపై చెరుకు సుధాకర్ స్పందించారు. ఈ సందర్భంగా చెరుకు సుధాకర్ మాట్లాడుతూ.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విచిత్రమైన అసభ్య పదజాలం ఉపయోగించి నా కొడుకుకు ఫోన్ చేసి నన్ను తిట్టడం నాకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. తాను కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా అతను స్టార్ క్యాంపెనర్ గా ఉండి ఒకే పార్టీలో పని చేస్తున్న తనపై ఆ భాష ఏమిటో అర్థం కావట్లేదని ఆయన అన్నారు. ఆయనకు మతి ఉండి మాట్లాడుతుండో మతి లేక మాట్లాడుతుండు అర్థం కావట్లేదు దీనిని నేను సీరియస్ గా తీసుకుంటానన్నారు.
Also Read : Kiara Advani: వీపందం చూపి రెచ్చగొడుతున్న కొత్త పెళ్లికూతురు
తాను వ్యక్తిగతంగా ఎవరిని కామెంట్ చేయలేదని, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసభ్య పదజాలంతో తనను తిట్టిన ఆడియో టేపును తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు థక్రే, పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఫార్వర్డ్ చేశానన్నారు. ఇలాంటి వాళ్ల పెత్తనం పార్టీలో ఎన్ని రోజులు కొనసాగుతుందో అనేది ప్రశ్నార్థకంగా మారిందని ఆయన మండిపడ్డారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నన్ను అసభ్య పదజాలంతో తిట్టిన ఆడియో తెలంగాణ రాజకీయాలలో తీవ్రమైన అంతర్మాదనానికి చర్చకు దారితీస్తుందన్నారు.
Also Read : Inter Student Heart Attack: అసలు ఏమవుతుందిరా.. గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి మృతి
నేను రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సందర్భాలలో కాంగ్రెస్ పార్టీని పరిరక్షించుకుంటానికి మాట్లాడుకున్నాము.. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వ్యక్తిగతంగా తిట్టిన సందర్భాలు లేవని, ఆయనపై నేను వ్యక్తిగతంగా ఏమైనా వ్యాఖ్యలు చేస్తే 100 శాతం నేను మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో పెట్టే స్వేచ్ఛ ఆయనకు ఉందన్నారు. నయీమ్ లాంటి కరుడుగట్టిన తీవ్రవాదే నన్ను ఏమి చేయలేక పోయిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చేస్తాడని ఆయన వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనపై చేసిన అసభ్య వ్యాఖ్యలపై అధిష్టానం నిర్ణయం తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల దృష్టిలో తెలంగాణ ప్రజల దృష్టిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి డక్ ఔట్ అయిన వికెట్ అని ఆయన విమర్శించారు.