Komatireddy Venkat Reddy Challenges To BRS Government: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓ సవాల్ విసిరారు. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వం రూ.3 వేలకు కొనుగోలు చేస్తోందని.. తాను చెప్పేది అబద్ధమైతే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని.. మీరు రాజీనామా చేయడానికి సిద్ధమా? అని ఛాలెంజ్ చేశారు. యాదాద్రి జిల్లా గుండాల మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి చేతులెత్తి దండం పెడుతున్నానన్నారు. అయితే.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వ్యవహారంపై మాట్లాడేందుకు మాత్రం వెంకటరెడ్డి నిరాకరించారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి తాను వెళ్లలేదని, ఆ వ్యవహారంపై తనకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఈటెల, రేవంత్ ఎపిసోడ్‌పై నేను మాట్లాడేది ఏమీ లేదని తెలిపారు.
RCB vs RR: ఆర్సీబీ పరుగుల వర్షం.. 10 ఓవర్లలో స్కోరు ఇది!
కాగా.. రూ.25 కోట్లకు సంబంధించిన వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని.. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు రూ. 25 కోట్లు ఇచ్చిందని ఈటల చేసిన వ్యాఖ్యలు.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. ఈ నేపథ్యంలోనే.. రేవంత్ రెడ్డి భావోద్వేగానికి గురవ్వుతూ.. మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ సాయం గానీ, బీఆర్ఎస్ పార్టీ సాయం గానీ కాంగ్రెస్ పార్టీ తీసుకోలేదన్నారు. ఒకవేళ తాను చెప్పింది అబద్దమే అయితే.. తాము సర్వనాశనం అవుతామన్నారు. అమ్మవారి సాక్షిగా తాను చెప్పేది అబద్ధమైతే.. తాను సర్వనాశనం అవుతానని తేల్చి చెప్పారు. రేవంత్ చేసిన ఈ ప్రమాణంపై ఈటల రాజేందర్ స్పందించారు. ఆలయంలోకి వెళ్లి అమ్మతోడు, అయ్యతోడు అనడం ఏంటని ఎద్దేవా చేశారు. తాను చేసిన వ్యాఖ్యలతో పాటు అన్ని అంశాలపై త్వరలోనే స్పందిస్తానన్న ఆయన.. తానూ రేవంత్ రెడ్డి పేరుని ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. తాటాకు చప్పుళ్లకు ఈటల రాజేందర్ భయపడడని.. నిజమేంటో అబద్దమెంటో ప్రజలే తేలుస్తారని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి కన్నీళ్లు పెడతారని అనుకోలేదని, ధీరుడు ఎప్పుడూ కన్నీరు పెట్టరన్నారు. ఇలా ఈ ఇద్దరి మధ్య సాగుతున్న ఈ మాటల యుద్ధంపై.. తాను మాట్లాడలేనంటూ వెంకటరెడ్డి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది.
Ys Viveka Case: వివేకా కేసులో సీబీఐ దూకుడు.. పులివెందులలో తనిఖీలు