విభజన చట్టంలో మిగిలి పోయిన సమస్యలు సాధించాలన్నారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాలేదని, ఛార్జ్ తీసుకున్న మూడో రోజే నేను తెలంగాణా భవన్ ను పరిశీలించానన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఢిల్లి లోనిఆంధ్ర భవన్ విభజన పై స్పష్టత వచ్చిందని, హైదారాబాద్ హౌజ్ పక్కన తెలంగాణ భవన్ నిర్మాణం జరగనుందన్నారు. ఇప్పటికే కొన్ని మోడల్స్ పరిశీలిస్తున్నామని, త్వరలోనే…
Telangana Ministers for Kalavedika Ntr Film Awards: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్. నందమూరి తారకరామారావు పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతి గాంచిన సినీ నటి నటులకు “కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్” 2024 అందించేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ లోని హోటల్ “దసపల్లా”లో ఈ అవార్డుల ప్రధానోత్సవం అతిరధమహారథుల సమక్షంలో జరుగనుంది. “కళావేదిక” ( దివంగతR.V.రమణ మూర్తి), ” రాఘవి మీడియా” ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ…
తెలంగాణలో ఓటు షేర్ పెంచుకున్నామని, సుస్థిర పాలన అందిస్తున్నామని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. 2018 నుంచి రీజనల్ రింగ్ రోడ్‌పై చర్చ జరుగుతుంది కానీ ముందుకు కదలడం లేదన్నారు.
నల్లగొండ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజర్యారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ నిర్ణయం తీసుకున్న సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. రెండు లక్షల రుణమాఫీ గతంలో ఎవరు చేయలేదని, గత ప్రభుత్వాలు చేసిన రుణమాఫీ వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు. రెండు లక్షల రుణమాఫీ దేశంలో ఏ ప్రభుత్వం కూడా అమలు చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. రైతులకు…
ఉస్మానియా హాస్పటల్ నిర్మాణంపై మరోసారి అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తామని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఉన్న స్థలంలోనే ఉస్మానియా హాస్పటల్ నిర్మిస్తామన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
Komatireddy Venkat Reddy Launched Eye-pleasing First Look Of Pranayagodari: ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ గా ప్రణయగోదారి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రముఖ కమెడియన్ అలీ ఫ్యామిలీ నుంచి వచ్చిన నటుడు సదన్ హీరోగా నటిస్తుండగా ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తోంది. పిఎల్‌వి క్రియేషన్స్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా పారమళ్ళ లింగయ్య ఈ ‘ప్రణయగోదారి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేస్తునే…
రాష్ట్రంలోని 436 కిలోమీటర్ల మేర రోడ్ల మరమ్మతు పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. మరమ్మతులు చేపట్టేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు రోడ్లు, భవనాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అధికారుల ప్రకారం, సాధారణంగా వర్షాకాలం ప్రారంభానికి ముందే రోడ్ల మరమ్మతులు చేపడతారు, అయితే లోక్‌సభ ఎన్నికల కారణంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమలులో ఉన్నందున, రాష్ట్ర ప్రభుత్వం మరమ్మతులు చేపట్టడానికి టెండర్లను ఖరారు చేయలేకపోయింది. సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్…
మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక మోసగాడు పదేళ్లు తెలంగాణ పరిపాలించాడని తీవ్రంగా విమర్శించారు. ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తే.. జిన్నా ఆగస్టు 14న వేడుకలు చేసుకున్నాడని విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కూడా అట్లనే జూన్ 1 నుండి వేడుకలు చేస్తున్నాడన్నారు.
ఏపీ ఫలితాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. ఎగ్జిట్ పోల్స్‌లో అవే చెబుతున్నాయని ఆయన చెప్పారు. తన స్నేహితులు, బంధువుల సమాచారం మేరకు జగన్ రెండోసారి సీఎం అవుతారన్నారు.
సోనియా లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు, ఆ విషయాన్ని కేసీఆర్ నిండు సభలో చెప్పారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని స్కీంలలో స్కామ్‌లు జరిగాయని.. గొర్రెల పథకంలో భారీ స్కాం జరిగిందన్నారు. నిజామాబాద్ పార్లమెంట్‌తో సహా 12 పార్లమెంట్ స్థానాల్లో గెలుస్తామన్నారు.