ఆరేళ్ల చిన్నారి హత్య కేసును ఛేదించినట్లు ప్రకటించిన హోంమంత్రి అనిత పుంగనూరులో ఆరేళ్ల చిన్నారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. అస్ఫియా హత్య కేసును ఛేదించినట్లు హోంమంత్రి అనిత స్వయంగా ప్రకటించారు. అస్ఫియా ఆచూకీ కోసం 12 ప్రత్యేక పోలీసు బృందాలు గాలించినట్లు హోంమంత్రి తెలిపారు. చిన్నారి హత్యకు గురికావడం బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. వైసీపీ హయాంలో వందలమందిపై అత్యాచారాలు జరిగాయని తీవ్రంగా విమర్శించారు.…
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన తర్వాత సీట్లు దొరకడం లేదని మహిళలు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎదుట వాపోయారు. మునుగోడు వద్ద ఆర్టిసీ బస్సు ఎక్కిన రాజగోపాల్ రెడ్డి మహిళలను పలకరించారు.. ఈ క్రమంలోనే రాజగోపాల్ రెడ్డి మహిళల మధ్య ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పై ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన తర్వాత బస్సులో ప్రయాణించే మహిళల సంఖ్య పెరిగిందని…. ఫ్రీ బస్సు సౌకర్యం కంటే ముందు…
మానవత్వం ఉన్న మనుషులైతే మూసీ ప్రక్షాళనకు మద్దతు ఇస్తారని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. మూసి నరకం నుంచి నల్గొండ జిల్లా ప్రజలకు విముక్తి కలుగుతుందన్నారు. మూసి పరివాహక ప్రాంతాల్లో పండే పంటలో ఐరన్ ఎక్కువ అని ప్రియాంకా వర్గీస్ స్టడీ రిపోర్ట్ ఇచ్చారన్నారు. ఓ వైపు ఫ్లోరిన్.. ఇంకో వైపు మూసి అంటూ మంత్రి తెలిపారు.
కేటీఆర్ పచ్చి అబద్దాల మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. కేటీఆర్ లేని పోని ..నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షం ఉందా.. ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడా అనేది కూడా తెలియకుండా పోయిందన్నారు. పచ్చకామెర్లు వాడికి ప్రపంచం అంతా పచ్చగా కనిపించినట్టు ఉంది కేటీఆర్ పరిస్థితి ఉందన్నారు. మీలాగా మేము ఉండమని, మేము అధికారం లోకి వచ్చి 8 నెలలు.. 8 వేల కోట్లు ఎక్కడ వచ్చాయో చెప్పాలన్నారు. కాళేశ్వరం కూలిపోయింది.దాంట్లో…
రేపు నల్గొండ జిల్లాలో మంత్రులు పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రులు ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు పరిశీలించనున్నారు. అమెరికాలోని రాబిన్ సన్ సంస్థ నూతన టెక్నాలజీని వాడాలని ప్రభుత్వం నిర్ణయింది. ఈ నేపథ్యంలో రెండు సంవత్సరాల్లో SLBC పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఖర్చుకు వెనుకాడేది లేదని మంత్రి…
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. మంత్రికి.. పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పట్టణంలో నూతనంగా నిర్మించనున్న నాలుగు ఫ్లైఓవర్ పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే కుందూర్ జైవీర్ రెడ్డి పాల్గొన్నారు. వరద బాధితుల కోసం 30టన్నుల బియ్యాన్ని తరలించే కార్యక్రమానికి జెండా ఊపి ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి… అనంతరం గురుపూజోత్సవంలో…
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. రెండో యూనిట్లో ఆయిల్ సింక్రానైజేషన్ చేసామని, త్వరలో యాదాద్రి ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తుందని ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వం సకాలంలో పనులు పూర్తి చేయకపోవడం వల్ల నిర్మాణ వ్యయం పెరిగిందని, గత ప్రభుత్వానికి…
Minister Komatireddy: టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ నెల 21 తేదీన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. మంత్రి లేఖ పైన త్వరిత గతిన విచారణ జరిపిన హైడ్రా కమిషనర్..
షెరటన్ హోటల్లో జరిగిన సీఎల్పీ సమావేశంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. మునిగిపోయిన పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీ లో విలీనం అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ బీజేపీలో విలీనం పై ఢిల్లీ లో చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో చాలా చోట్ల బీఆర్‌ఎస్ డిపాజిట్ కోల్పోయింది. హరీష్ రావు, కేటీఆర్ నియోజక వర్గాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో తక్కువ ఓట్లు వచ్చాయని ఆయన అన్నారు. మేము…
తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర సాయుధ యోధులకు అమరవీరులకు నివాళులు.. ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. తెలంగాణ వచ్చిన సందర్భంలో స్వాతంత్ర దినోత్సవం రోజున సీతారామ ప్రాజెక్టు ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రారంభం చేయడం సంతోషకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి హోదాలో బిజీ కొత్తూరు సీతారామ పంప్ హౌస్ నా చేతుల మీదుగా ప్రారంభించడం నా జన్మ ధన్యమైందన్నారు. ప్రాజెక్టు నిర్దిష్ట లక్ష్యంగా ఉన్న ఆయకట్ట భూములకు ఎంత ఖర్చైనా…