తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడూ వార్తల్లో ఉంటారు.. పీసీసీ చీఫ్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించినా.. అది దక్కించుకోలేకపోయారు పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంటకర్‌రెడ్డి, మరోవైపు.. ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తన అభిప్రాయాలను కుండబద్దలుకొట్టేస్తుంటారు.. ఇక, పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. టి.పీసీసీ.. కోమటిరెడ్డి మధ్య గ్యాప్ కొనసాగుతూనే ఉంది. అయితే, కోమటిరెడ్డి బ్రదర్స్‌తో తాను మాట్లాడుతా అంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత,…