ప్రముఖ తమిళ హాస్యనటుడు వివేక్ ఈ ఉదయం కన్నుమూశారు. ఉదయం 4:35 గంటలకు ఆయన కన్నుమూసినట్టు వైద్యులు పేర్కొన్నారు. నిన్న ఉదయం 11 గంటలకు గుండె నొప్పితో ఆయన ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. వివేక్ మరణం పట్ల తమిళ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. దాదాపుగా 300 లకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. కె బాలచందర్ దర్శకత్వం వహించిన మనదిల్ ఉరుది వేండం సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. కోలీవుడ్ టాప్ హీరోలందరితో కలిసి అయన నటించారు.