కోలీవుడ్ స్టార్ హీరో విజయ్- పూజా హెగ్డే జంట నటిస్తున్న చిత్రం ‘బీస్ట్’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవుతుందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే షూటింగ్ ని కూడా పూర్తి చేసుకుందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే వారిని షాక్ కి గురిచేస్తూ సంక్రాంతికి కాకుండా సమ్మర్ లో ‘బీస్ట్’ వస్తున్నాడని మేకర్స్ ప్రకటించారు. కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ బీస్ట్ రిలీజ్ డేట్ ని ప్రకటించారు.
ఏప్రిల్ 2022 లో బీస్ట్ అడుగుపెట్టబోతున్నాడు అంటూ తెలుపుతూ విజయ్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. దీంతో ఫ్యాన్స్ కొద్దిగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక పోస్టర్ విషయానికొస్తే విజయ్ నిజంగానే బీస్ట్ లుక్ లో కనిపించాడు.. ఒంటి నిండా గాయాలతో, రక్తపు మరకలతో, తీక్షణమైన చూపుతో కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సమ్మర్ లో ఈ సినిమా ఎంతటి వేడిని పుట్టిస్తుందో చూడాలి.