Lady Macbeth of Bengal: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 'లేడీ మాక్బెత్ ఆఫ్ బెంగాల్' అంటూ సీఎం మమతాని పిలిచారు.
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. కేసు దర్యాప్తును అణచివేసేందుకు ప్రయత్నించారంటూ బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. మరోవైపు.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అబద్ధాలు చెబుతున్నారని బాధితురాలి తల్లి ఆరోపించింది. తనకు పరిహారం కూడా అందజేస్తామని చెప్పినట్లు పేర్కొంది. కాగా.. ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారనే ఆరోపణలను మమత ఖండించారు.
కోల్‌కతా అత్యాచార హత్య కేసులో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం-హత్యపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్ మరణించిన రోజున ఓ జూనియర్ డాక్టర్ ఛాతీ ఔషధాల విభాగంలోని కూల్చివేసిన బాత్రూమ్లో స్నానం చేసినట్లు వెల్లడించింది.
కోల్‌కతాలోని ఆర్జి కర్ ఆసుపత్రిలో జరిగిన అత్యాచారం, హత్య కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పాలిగ్రాఫ్ పరీక్షలో షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇండియా టుడే నివేదిక ప్రకారం.. పరీక్ష సమయంలో, సంజయ్ రాయ్ తనని ఇరికించారని, తాను హత్య చేయలేదని చెప్పాడు.
RG Kar Ex-Principal: కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాటు ఆయన బంధువుల ఇళ్లలో, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
Kolkata : కోల్‌కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్‌ను సిబిఐ సోమవారం అరెస్టు చేసింది. ఆ తర్వాత ఘోష్‌ను మంగళవారం అలీపూర్ కోర్టులో హాజరుపరిచారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీకి మరో లేఖ రాశారు. ఈ సందర్భంగా మమత.. కఠినమైన కేంద్ర చట్టం, అత్యాచారం, హత్య వంటి క్రూరమైన నేరాలను పాల్పడి నిందితులను శిక్షించాలని.. నిర్ణీత గడువులోపు కేసులను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.