కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో జరిగిన అత్యాచారం, హత్య కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పాలిగ్రాఫ్ పరీక్షలో షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఇండియా టుడే నివేదిక ప్రకారం.. పరీక్ష సమయంలో, సంజయ్ రాయ్ తనని ఇరికించారని, తాను హత్య చేయలేదని చెప్పాడు.
RG Kar Ex-Principal: కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాటు ఆయన బంధువుల ఇళ్లలో, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
Kolkata : కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్‌ను సిబిఐ సోమవారం అరెస్టు చేసింది. ఆ తర్వాత ఘోష్‌ను మంగళవారం అలీపూర్ కోర్టులో హాజరుపరిచారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీకి మరో లేఖ రాశారు. ఈ సందర్భంగా మమత.. కఠినమైన కేంద్ర చట్టం, అత్యాచారం, హత్య వంటి క్రూరమైన నేరాలను పాల్పడి నిందితులను శిక్షించాలని.. నిర్ణీత గడువులోపు కేసులను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కోల్‌కతాలో వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసు ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా లేదు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే ఇప్పటి వరకు పౌర వాలంటీర్ సంజయ్ రాయ్ మినహా ఎవరినీ అరెస్టు చేయలేదు.
Kolakata Murder Case : కోల్‌కతాలో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం-హత్య కేసులో విధులు నిలిపివేసి రాష్ట్రంలోని జూనియర్ డాక్టర్లు గత 20 రోజులుగా సమ్మె చేస్తున్నారు.
కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యాచారం కేసుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారిగా స్పందించారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాష్ట్రపతి మాట్లాడుతూ..
సీఎం మమతా బెనర్జీ, కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్‌లకు సీబీఐ పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేసింది. బాధితురాలు ఆత్మహత్య చేసుకుందని పోలీసు కమిషనర్ మొదట చెప్పారని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది.