ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో జూనియర్ డాక్టర్ల సమావేశం ముగిసింది. కాళీఘాట్ నివాసంలో ఆమెతో రెండు గంటల పాటు చర్చలు జరిపారు. పోలీస్ ఎస్కార్ట్ వాహనంతో 30 మంది వైద్యులు సాయంత్రం 6:20 గంటలకు ముఖ్యమంత్రి నివాసానికి వచ్చారు. సాయంత్రం 5గంటలకు ప్రారంభం కావాల్సిన భేటీ రాత్రి 7 గంటలకు ప్రారంభమై 9 గంటలకు ముగిసింది. సమావేశం అయితే ముగిసింది కానీ.. డాక్టర్లు ఇంకా బయటకు రాలేదు. ఏం చర్చించారు అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
ఇది కూడా చదవండి: Sunday Girlfriend: “సండే గర్ల్ ఫ్రెండ్”.. ఇదేదో తేడాగా ఉంది మాస్టారూ!
మమతతో రెండు సార్లు చర్చలు జరిపి విఫలమైన తర్వాత చివరిగా సోమవారం సాయంత్రం 5 గంటలకు రావాలని ప్రభుత్వం వైద్యులను ఆహ్వానించింది. మొత్తానికి వైద్యులు అంగీకరించి చర్చలకు వెళ్లారు. రెండు సార్లు సమావేశ టేబుల్ దగ్గర కూర్చోకుండా వెళ్లిపోయారు. మొదటి సమావేశంలో ముఖ్యమంత్రి కూర్చొని, వైద్యుల బృందం కోసం వేచి ఉన్న ఫొటో వైరల్ అయింది. కాళీఘాట్ ఇంటి లోపలికి వచ్చి కనీసం ఒక కప్పు టీ అయినా తాగమని డాక్టర్లను మమత కోరారు. కానీ డాక్టర్లు న్యాయం జరిగాకే టీ తాగుతామని చెప్పారు.
ఇది కూడా చదవండి: Ganesh Nimajjanam: వినాయక నిమజ్జనంలో అపశృతి.. బాణసంచా పేలి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
ఆగస్టు 9న కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలు అత్యంత క్రూరంగా హత్యాచారానికి గురైంది. అనంతరం ఈ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది. దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. అలాగే కోల్‌కతాలో డాక్టర్లు విధులు బహిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మొత్తానికి ప్రభుత్వంతో డాక్టర్లు చర్చలు జరిపారు.
ఇది కూడా చదవండి: Black Magic: గణపతి నవరాత్రోత్సవాల వేళ క్షుద్రపూజలు!