పశ్చిమ బెంగాల్లోని వివిధ ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో పోలీసులు భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే బాణసంచా నిషేధించారని మరియు అక్రమ తయారీ కర్మాగారాలను నడుపుతున్నారనే ఆరోపణలపై కనీసం 100 మందిని అరెస్టు చేసినట్లు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పశ్చిమ బెంగాల్ క్లబ్ మైదానంలో తన సంగీత కచేరీకి ముందు ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కోల్కతాలో కలిశారు. కాళీఘాట్లోని బెనర్జీ నివాసంలో ఈ సమావేశం జరిగింది.
‘భోళా శంకర్’ సినిమా కూడా అదే కోల్కతా బ్యాక్డ్రాప్లో ఉండబోతోంది అని తెలుస్తుంది. కాబట్టి, ‘చూడాలని వుంది’ మ్యాజిక్ను మెగాస్టార్ చిరంజీవి రిపీట్ చేయబోతున్నారని చిత్ర బృందం అంటుంది. ఇప్పుడు మిగిలిన సన్నివేశాలను కోల్కతాలో ఇవాళ్టి నుంచి చిత్రీకరించనున్నారు.
Kolkata : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న బాలికను హత్య చేసేందుకు ప్రయత్నించిందో తల్లి. ఆ మహిళ తన ప్రేమికుడితో కలిసి ప్లాన్ చేసి తన పదహారేళ్ల కుమార్తెను కాల్చి చంపాలనుకుంది.
శంఖు ఆకారంలో ఉన్న ఈ నిర్మాణం చూపరులను ఈ ఆడిటోరియం కట్టిపడేస్తోంది. రూ. 440 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆడిటోరియంలో అనేక విభాగాలు ఉన్నాయి. అద్భుత కట్టడంగా పేర్కొంటున్న ఈ ధన ధాన్య ఆడిటోరియంను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రారంభించారు.
Kolkata Metro Runs Under River, First In India: కోల్కతా మెట్రో రికార్డ్ క్రియేట్ చేసింది. దేశంలో తొలిసారిగా నదీ గర్భం నుంచి మెట్రో రైల్ పరుగులు తీసింది. హుగ్లీ నది నుంచి ఏర్పాటు చేసిన సొరంగం గుండా మెట్రో రైల్ పరుగులు పెట్టింది. ఈ విషయాన్ని బుధవారం సీనియర్ అధికారి వెల్లడించారు. అధికారులు, ఇంజనీర్లతో కూడిన మెట్రో రైల్ హుగ్లీ నది కింద నుంచి కోల్కతా నుండి నదికి అవతలి వైపున హౌరా వరకు…
భారత్ దేశంలోనే తొలి నీటి అండర్ గ్రౌండ్ లో నడిచే మెట్రో ట్రైన్ కోత్ కతాలో ప్రారంభం కానుంది. ఇలా మెట్రో ట్రైన్ లో నీటి లోపల ప్రయాణిస్తూ వారు మాల్దీవుల్లో ఉన్న అనుభూతిని పొందే అవకాశం ఉంది. కోల్ కతాలోని హుగ్లీ నదిలో నిర్మించిన సొరంగం ద్వారా మొదటి నీటి అడుగున మెట్రో వెళ్తుంది.
Bank Loan Fraud: సాధారణంగా సామన్యుడైన రైతుకు లోన్ పెంచాలంటే సవాలక్ష ప్రశ్నలు వేసే బ్యాంకు అధికారులు, కొంత మంది దొంగల మాటల వలలో పడి కోట్లకు కోట్లు అప్పులు ఇస్తుంటారు. ఇలాంటి ఘటనలు ఇండియాలో చాలానే జరిగాయి. తాజాగా తప్పుడు పత్రాలు సమర్పించి ఓ వ్యాపారవేత్త స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.95 కోట్లు టోకరా పెట్టాడు. చివరకు అతడిని అధికారులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే కోల్కతాకు చెందిన వ్యాపారవేత్త ఎస్ బీ ఐ…
Killer Plant Fungus: ప్రపంచంలో అత్యంత అరుదుగా మొక్కల్లో సోకే ఫంగస్ మనుషులను కూడా ప్రభావితం చేస్తుంది. అయితే ప్రపంచంలోనే తొలిసారిగా కోల్కతాకు చెందిన ఓ వ్యక్తిలో కనుక్కున్నారు. మొక్కలతో సన్నిహితంగా ఉండే వ్యక్తులకు మాత్రమే ఈ ఫంగస్ సోకే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం శిలీంధ్రం ఇన్ఫెక్షన్ కు గురైన వ్యక్తి మొక్కలకు వచ్చే వ్యాధుల గురించి అధ్యయనం చేసే ప్లాంట్ మైకాలజిస్ట్. మొక్కల శిలీంధ్రాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నందువల్లే సదరు వ్యక్తికి శిలీంద్రం ఇన్ఫెక్షన్ సోకింది.