Mamata Banerjee Home: ఆయుధాలతో మమతా బెనర్జీ ఇంట్లోకి ప్రవేశించేందుకు యత్నం.. నిందితుడు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee Home: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాళీఘాట్ నివాసంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని శుక్రవారం కారులో ఆయుధాలతో అరెస్టు చేశారు. నల్లకోటు, టై ధరించిన వ్యక్తి హరీష్ ఛటర్జీ స్ట్రీట్‌లోని మమతా బెనర్జీ నివాసంలోకి ‘పోలీస్’ స్టిక్కర్ ఉన్న కారుతో వెళ్లడానికి ప్రయత్నించాడు. ఆ కారును తనిఖీ చేయడంతో అందులో ఆయుధాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో అతడిని అరెస్ట్ చేసినట్లు తెలిసింది. మమతా బెనర్జీ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన వ్యక్తిని నూర్ ఆలంగా పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ తెలిపారు. ఈ ఘటన జరిగినప్పుడు మమతా బెనర్జీ తన ఇంట్లోనే ఉన్నారు.
Also Read: New Delhi: ఇండియా శ్రీలంక మధ్య ఆర్థిక భాగస్వామ్యం.. విజన్ డాక్యుమెంట్‌పై ఆమోదం
Also Read
ఆ వ్యక్తి వద్ద ఆయుధాలు, గంజాయి, బీఎస్‌ఎఫ్, ఇతర వివిధ ఏజెన్సీలకు చెందిన అనేక గుర్తింపు కార్డులను కలిగి ఉన్నాడని కమిషనర్ వినీత్ గోయల్ వెల్లడించారు. ఆ వ్యక్తి ముఖ్యమంత్రిని కలవాలనుకున్నాడని తెలిపారు. ఇది తీవ్రమైన సమస్య అని, ఆ వ్యక్తి అసలు ఉద్దేశం ఏమిటో తెలుసుకోవడానికి తాము ప్రయత్నిస్తున్నామన్నారు. వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తి అసంబద్ధంగా మాట్లాడుతున్నాడని ఆయన అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి తన కాళీఘాట్ నివాసం నుంచి నగరంలోని సెంట్రల్ ప్రాంతంలో ‘అమరవీరుల దినోత్సవం’ ర్యాలీ వేదికకు చేరుకోవడానికి కొన్ని గంటల ముందు ఈ సంఘటన జరిగింది.
తాజావార్తలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!