ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు మరో మ్యాచ్ జరుగుతోంది. కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ ఉండనుంది. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా.. ముందుగా టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించి ప్లేఆఫ్స్ కు క్వాలిఫై కావాలని ఇరుజట్లు ఆశిస్తున్నాయి.
భారతరత్నశ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం, లక్నో వేదికగా.. నేడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 54వ మ్యాచ్ లో కెఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ (LSG), శ్రేయాస్ అయ్యర్స్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో తలపడనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో రెండవ స్థానంలో ఉండగా., లక్నో సూపర్ జెయింట్స్ 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉంది. లక్నోలోని భారత రత్న…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. 24 పరుగుల తేడాతో గెలుపొందింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. 18.5 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటైంది. కేకేఆర్ బౌలర్లు విజృంభణతో ముంబై చిత్తుగా ఓడిపోయింది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా.. ముంబై ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. 19.5 ఓవర్లలో కేకేఆర్ 169 పరుగులు చేసి ఆలౌటైంది. కోల్కతా బ్యాటింగ్ లో వెంకటేష్ అయ్యర్ (70), ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన మనీష్ పాండే (42) పరుగులతో రాణించడంతో.. కోల్కతా ఫైటింగ్ స్కోరు చేయగలిగింది. టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ కేకేఆర్.. వెంకటేశ్ అయ్యర్ చివరకు వరకు ఉండి జట్టు స్కోరు పెంచాడు. అతనితో…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు ముంబై ఇండియన్స్- కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై.. ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో కోల్కతా విజయం సాధించింది. 154 పరుగుల లక్ష్యాన్ని 16.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి సాధించింది. కోల్కతా బ్యాటింగ్ లో ఫిల్ సాల్ట్ (68) రన్స్ చేయడంతో కేకేఆర్ అలవోకంగా విజయం సాధించింది. కోల్కతా బ్యాటింగ్ లో సునీల్ నరైన్ (15), రింకూ సింగ్ (11) పరుగులు చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (33*), వెంకటేష్ అయ్యర్ (26*) పరుగులతో రాణించడంతో…
ఐపీఎల్ 2024లో భాగంగా.. కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ 153 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఓ మోస్తారు స్కోరును సాధించింది. ఢిల్లీ భారీ స్కోరు చేయకుండ ఉండేందుకు కేకేఆర్ బౌలర్లు శ్రమించడంతో పరుగులను కట్టడి చేశారు. ఢిల్లీ బ్యాటింగ్ లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అత్యధికంగా (35*) పరుగులు చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్ (27) పరుగులు సాధించాడు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. నేడు ఢిల్లీ క్యాపిటల్స్-కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో మొదట టాస్ గెలిచిన ఢిల్లీ.. బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా.. ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఇరుజట్లు ఉన్నాయి. ఇంతకుముందు మ్యాచ్ లో ఓడిపోయిన కేకేఆర్.. ఈ మ్యాచ్ లో గెలిచి పుంజుకోవాలని చూస్తోంది. మరోవైపు.. ఈ మ్యాచ్ లో విక్టరీ సాధించి…
ఐపీఎల్ 2024లో భాగంగా.. కోల్కతాతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ సంచలనం సృష్టించింది. 262 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే చేధించి రికార్డు సృష్టించింది. 262 పరుగుల టార్గెట్ ను పంజాబ్ బ్యాటర్లు చితక్కొట్టారు. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి కోల్కతా బౌలర్లకు తమ హోంగ్రౌండ్ లో చుక్కలు చూపించారు. బ్యాటింగ్ కు వచ్చినోళ్లు వచ్చినోళ్లు సిక్సర్ల వర్షం కురిపించారు. 262 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. ఓపెనర్లు ప్రభ్ సిమ్రాన్ (54)…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు కోల్కతా నైట్రైడర్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. మొదట టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.