భారతరత్నశ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం, లక్నో వేదికగా.. నేడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 54వ మ్యాచ్ లో కెఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ (LSG), శ్రేయాస్ అయ్యర్స్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో తలపడనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో రెండవ స్థానంలో ఉండగా., లక్నో సూపర్ జెయింట్స్ 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉంది. లక్నోలోని భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో ఆదివారం నాడు రాత్రి 7:30 కి మ్యాచ్ జరుగుతుంది.
Also Read: After 9 Pub: అర్ధరాత్రి పబ్ లో రైడ్స్.. అదుపులో 35 మంది యువతులు..
ఇక ఇరు జట్ల విషయానికి వస్తే లక్నో, కోల్‌కతా ఇప్పటి వరకు 4 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాయి . లక్నో 3 మ్యాచ్ లు గెలవగా, కోల్‌కతా నైట్ రైడర్స్ 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. కోల్‌కతాపై లక్నో సూపర్ జెయింట్స్ అత్యధిక స్కోరు 210. అలాగే లక్నోపై కోల్‌కతా అత్యధిక స్కోరు 208. ఈ ఏడాది సీజన్ లో ఏప్రిల్ 14న ఈ రెండు జట్లు చివరిసారిగా తలపడ్డాయి. లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 161/7 చేసింది. కోల్‌కతా 15.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Also Read: PBKS vs CSK: పంజాబ్‌తో పోరుకు సిద్ధమైన చెన్నై.. ప్లేఆఫ్ రేసులో నిలిచెదెవ్వరో..
ఇక నేడు ఇరుజట్ల ఆటగాళ్ల విషయానికి వస్తే.. లక్నో సూపర్ జెయింట్స్ లో KL రాహుల్ (C & WK), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్/కె గౌతం లు ఉండవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్ గా అర్షిన్ కులకర్ణి ఆడొచ్చు. ఇక మరోవైపు..
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) లో ఫిల్ సాల్ట్ (WK), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ/మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్ (సి), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తిలు ఉండబోతున్నట్లు అంచనా వేయవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్ గా సుయాష్ శర్మను ఆడించే అవకాశం ఉంది.