ఐపీఎల్ 2024లో భాగంగా.. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో చెన్నై గెలుపొందింది. 17.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. చెన్నై బ్యాటింగ్ లో రుతురాజ్ గైక్వాడ్ (67), శివం దూబె (28), డారిల్ మిచెల్ (25), రచిన్ రవీంద్ర (15) పరుగులు చేశారు. చివరలో ధోనీ వచ్చి అభిమానులకు సంతోషం అందించారు. చెన్నై గెలుపుతో మూడో విజయాన్ని నమోదు…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. చెన్నై ముందు 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేయడంతో కోల్కతా బ్యాటర్లు చేతులెత్తేశారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్- కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. ముందుగా టాస్ గెలిచిన సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది. సన్ రైజర్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై ఓడిపోయిన సంగతి తెలిసిందే. కాగా.. హోంగ్రౌండ్లో జరిగే ఈ మ్యాచ్లో విజయం సాధించాలని సీఎస్కే భావిస్తోంది. మరోవైపు వరుస విజయాలతో దూసుకుపోతున్న కోల్కతా.. మరో విజయంపై కన్నేసింది.
ఐపీఎల్-2024లో వరుస విజయాలతో దూసుకుపోతున్న కోల్‌కతా నైట్ రైడర్స్ కు బిగ్ షాక్ తగిలింది. బుధవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ జట్టు యువ పేసర్ హర్షిత్ రాణా గాయపడ్డాడు. బంతిని ఆపేందుకు ప్రయత్నించగా అతని కుడి భుజానికి గాయమైంది. దీంతో.. ఆ మ్యాచ్ మధ్యలోనే ఫీల్డ్ నుంచి బయటికి వెళ్లిపోయాడు. తర్వాత ఫీల్డింగ్ రాలేదు. అంతేకాకుండా.. ఆ మ్యాచ్ లో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు.
ఇన్నింగ్స్ ప్రారంభం చూశాక తాము 220 పరుగుల వరకు చేస్తామనుకున్నామని, 272 స్కోర్ చేస్తామని మాత్రం అస్సలు ఊహించలేదని కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్డు (277) మిస్ అయినందుకు తమకు ఏమాత్రం బాధ లేదన్నాడు. యువ ఆటగాడు రఘువంశీ నిర్భయంగా ఆడాడని, యువ బౌలర్ హర్షిత్ రాణా గాయం పరిస్థితిపై తమకు ఇంకా తెలియదని శ్రేయస్ చెప్పాడు. బుధవారం విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్…
విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై కోల్‌కతా ఘన విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది.
ఐపీఎల్ చరిత్రలో రికార్డులకు తెలుగు రాష్ట్రాలు వేదికయ్యాయి. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు హైదరాబాద్‌లో ఇటీవల నమోదు కాగా.. నేడు 2వ అత్యధిక స్కోరు వైజాగ్‌లో నమోదైంది.
విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఐపీఎల్ 2024 16వ మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లు సిక్సర్ల, ఫోర్లతో విరుచుకుపడ్డారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది.
ఐపీఎల్ 17 సీజన్‌లో భాగంగా వైజాగ్ వేదికగాఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో భాగంగా 16వ మ్యాచ్ లో, ఢిల్లీ క్యాపిటల్స్ ఏప్రిల్ 3 విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్ కి ఆతిథ్యం ఇవ్వనుంది. రెండు జట్లూ విజయంతో బరిలోకి దిగుతున్నాయి. నేడు వైజాగ్ లో ఢిల్లీకి రెండో మరియు చివరి హోమ్ మ్యాచ్. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ తమ మిగితా ఐదు హోమ్ గేమ్ లను ఆడనుంది. చెన్నై సూపర్…