కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో జరిగిన అత్యాచారం, హత్య కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పాలిగ్రాఫ్ పరీక్షలో షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఇండియా టుడే నివేదిక ప్రకారం.. పరీక్ష సమయంలో, సంజయ్ రాయ్ తనని ఇరికించారని, తాను హత్య చేయలేదని చెప్పాడు.
దేశ సర్వోన్న త న్యాయస్థానంలో కోల్‌కతా ఆర్‌జీ కర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు చుక్కెదురైంది. ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేయాలంటూ సీబీఐకి కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా 8 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతి ఇచ్చింది. మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ సహా మరో ముగ్గురిని కస్టడీకి ఇచ్చింది. ప్రస్తుతం సీబీఐ కస్టడీలో విచారణ జరుగుతోంది.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెపై గ్యాంగ్‌రేప్ జరిగినట్లుగా.. పోస్టుమార్టం రిపోర్టులో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. మూడు వారాలు గడుస్తున్నా.. ఇంకా పురోగతి లభించలేదు. దీంతో ఈ కేసుపై రోజుకో వదంతు వ్యాప్తి చెందడంతో అయోమయం నెలకొంది. దర్యాప్తుపై సందిగ్ధం నెలకొంది. తాజాగా బాధిత కుటుంబం.. పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు.
కోల్‌కతా హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తున్న వేళ పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ.ఆనంద్.. పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసుల్లో కొంత మంది నేరాల్లో భాగమయ్యారని, అవినీతికి పాల్పడుతున్నారని, రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. అనంతరం న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు జరిగాయి. పలుచోట్ల తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అయితే ఈ ఘటన తర్వాత నిందితుడు సంజయ్ రాయ్‌ను అరెస్ట్ చేసినా.. అన్ని వేళ్లు మాత్రం ఆర్‌జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ వైపే చూపించాయి.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చోటుచేసుకున్నాయి. అనంతరం ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు అధికారులు లోతుగా విచారిస్తున్నారు. ఇక ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో జరిగిన ఆర్థిక అవకతవకలపై మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను ఎనిమిది రోజులు సీబీఐ కస్టడీకి న్యాయస్థానం అప్పగించింది.
సుప్రీంకోర్టులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. కోల్‌కతా ఆర్‌జీ కర్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనపై విద్యార్థి సంఘాలు చేపట్టిన ‘చలో సెక్రటేరియట్’ నిరసనల్లో అరెస్టైన ‘పశ్చిమ్ బంగా ఛత్ర సమాజ్’ సంస్థ విద్యార్థి నాయకుడికి ఇటీవల కోల్‌కతా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఇదిలా ఉంటే, ఈ ఘటనను ఇంకా మరవకముందే బెంగాల్‌లోని ఓ ఆస్పత్రిలో నర్సుపై రోగి వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. శనివారం రాత్రి బీర్భూమ్‌లోని ఇలంబజార్ హెల్త్ సెంటర్‌లో నర్సు విధి నిర్వహణలో ఉండగా, రోగి వేధింపులకు పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌లో చికిత్స చేస్తున్న సమయంలో రోగి తనని వేధించాడని నర్సు ఆరోపించింది. ఈ ఘటన జరిగిన సమయంలో నిందితుడి వెంట అతడి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీకి మరో లేఖ రాశారు. ఈ సందర్భంగా మమత.. కఠినమైన కేంద్ర చట్టం, అత్యాచారం, హత్య వంటి క్రూరమైన నేరాలను పాల్పడి నిందితులను శిక్షించాలని.. నిర్ణీత గడువులోపు కేసులను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.