కోల్‌కతా వైద్యురాలి హత్యాచారం కేసును సుప్రీంకోర్టు విచారిస్తోంది. అయితే ఈ విచారణను న్యాయస్థానం ప్రత్యక్ష ప్రచారం చేస్తోంది. ఈ కేసు విచారణను లైవ్ టెలికాస్ట్ చేయొద్దంటూ బెంగాల్ ప్రభుత్వం ధర్మాసనాన్ని కోరింది.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో జూనియర్ డాక్టర్ల సమావేశం ముగిసింది. కాళీఘాట్ నివాసంలో ఆమెతో రెండు గంటల పాటు చర్చలు జరిపారు. పోలీస్ ఎస్కార్ట్ వాహనంతో 30 మంది వైద్యులు సాయంత్రం 6:20 గంటలకు ముఖ్యమంత్రి నివాసానికి వచ్చారు.
మొత్తానికి బెంగాల్ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు జూనియర్ వైద్యులు అంగీకరించారు. సోమవారం ఇదే చివరి ఆహ్వానం అంటూ బెంగాల్ ప్రభుత్వం వైద్యులను ఆహ్వానించింది. ప్రత్యక్ష ప్రచారంపై గత కొద్దిరోజులుగా సమావేశంపై సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ప్రతిష్టంభన చోటుచేసుకుంది.
కోల్‌కతాలో నిరసనలు కొనసాగిస్తున్న జూనియర్ డాక్టర్లను బెంగాల్ ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. ఇప్పటికే నాలుగు సార్లు మమత సర్కార్ చర్చలకు పిలిచింది. కానీ డాక్టర్లు మాత్రం చర్చలు నిరాకరించారు.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై కోల్‌కతాలో జూనియర్ వైద్యులు నిరసనలు కొనసాగిస్తున్నారు. న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు. విధులు బహిష్కరించి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశించినా నిరసనలు కొనసాగించారు. దీంతో మమతా బెనర్జీ ప్రభుత్వం డాక్టర్లను చర్చలకు ఆహ్వానించింది.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. ఆగస్టు 9న కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలిపై అత్యంత క్రూరంగా హత్యాచారం జరిగింది. అనంతరం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి.
కోల్‌కతా అత్యాచార హత్య కేసులో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం-హత్యపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్ మరణించిన రోజున ఓ జూనియర్ డాక్టర్ ఛాతీ ఔషధాల విభాగంలోని కూల్చివేసిన బాత్‌రూమ్‌లో స్నానం చేసినట్లు వెల్లడించింది.