West Bengal: కోల్‌కతా ఘటన మరవకముందే.. బెంగాల్ హాస్పిటల్‌లో నర్స్‌పై వేధింపులు..
- కోల్‌కతా వైద్యురాలి ఘటన మరవకముందే మరో ఘటన..
- బీర్భూమ్ ఆస్పత్రిలో నర్సుపై రోగి వేధింపులు..
- చికిత్స సమయంలో అనుచితంగా తాకిన రోగి..
- పోలీసులకు ఫిర్యాదు.. నిందితుడి అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఘటన యావత్ దేశాన్ని ఆగ్రహావేశాలకు గురిచేసింది. నైట్ డ్యూటీలో ఉన్న 31 ఏళ్ల ట్రైనీ పీజీ వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. కాలేజ్ సెమినార్ హాలులోనే దారుణ ఘటన చోటు చేసుకుంది. అయితే, ఈ ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలని దేశవ్యాప్తంగా వైద్యులు, హెల్త్ వర్కర్లకు తోడు సాధారణ ప్రజలు ఆందోళనలు నిర్వహించారు. ఇప్పటికీ బెంగాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటనలో సంజయ్ రాయ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయగా, ఈ కేసుని సీబీఐ దర్యాప్తు చేస్తో్ంది.
Read Also: Kanguva Release Date: ఆ సినిమా రిలీజ్‌కు దారి ఇవ్వాలి.. కంగువ విడుదలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!
Also Read
- Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
ఇదిలా ఉంటే, ఈ ఘటనను ఇంకా మరవకముందే బెంగాల్‌లోని ఓ ఆస్పత్రిలో నర్సుపై రోగి వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. శనివారం రాత్రి బీర్భూమ్‌లోని ఇలంబజార్ హెల్త్ సెంటర్‌లో నర్సు విధి నిర్వహణలో ఉండగా, రోగి వేధింపులకు పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌లో చికిత్స చేస్తున్న సమయంలో రోగి తనని వేధించాడని నర్సు ఆరోపించింది. ఈ ఘటన జరిగిన సమయంలో నిందితుడి వెంట అతడి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.
‘‘నేను డాక్టర్ సూచనలు పాటిస్తున్నప్పుడు మగ రోగి నాతో అనుచితంగా ప్రవర్తించాడు. నా ప్రైవేట్ భాగాలపై అనుచితంగా తాకాడు. అతను నాపై దుర్భాషలాడాడు’’ అని నర్సు వివరించింది. సెక్యూరిటీ లేకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతాయని, లేకపోతే రోగి కుటుంబ సభ్యుల సమక్షంలో డ్యూటీలో ఉన్న వ్యక్తిపై అలాంటి పనిచేయడానికి ధైర్యం ఎలావస్తుంది..? అని ఆమె పేర్కొంది. ఈ ఘటన తర్వాత ఆస్పత్రి యాజమాన్యం పోలీసుల్ని ఆశ్రయించడంతో నిందితుడైన రోగిని అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
-
Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!