కొంతమందికి వృత్తి… ప్రవృత్తి ఒకటే వుంటుంది. మరికొందరికి చెప్పే వృత్తి ఒకటి.. చేసేది మరొకటి. హైదరాబాద్ పాతబస్తీలో బట్టల వ్యాపారము చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు. అందులో విశేషం ఏముంది అదీ వ్యాపారమే కదా అనకండి. అక్కడే ట్విస్ట్ వుంది. వారు బట్టల వ్యాపారం మాటున కత్తులు,తల్వార్లను అమ్ముతున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని వీరి నుండి తల్వారు, కత్తులను స్వాధీనం చేసుకున్నారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. బండ్లగూడ, నూరినగర్, జహంగీరాబాద్ కు…