లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు రూ.12లక్షలు జరిమానా పడింది. ముంబై ఇండియన్స్‌తో శనివారం సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో స్లోఓవర్ రేట్ కారణంగా కేఎల్ రాహుల్ మ్యాచ్ ఫీజులో కోత పడింది. కాగా ఈ మ్యాచ్‌లో ముంబైపై లక్నో జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సహాయంతో సెంచరీ చేసిన రాహుల్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో తాను ఆడుతున్న వందో…
ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ సెంచరీతో అదరగొట్టాడు. 56 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేశాడు. ఇన్నింగ్స్ చివరి వరకు నిలబడి 103 నాటౌట్‌తో నిలిచాడు. కేఎల్ రాహుల్‌కు డికాక్ (24), మనీష్…
ఐపీఎల్‌లో ఈరోజు సూపర్ మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఈ రోజు మ్యాచ్ జరగబోతోంది. మరి ఈ రెండు సూపర్ జట్లలో విజయం ఏ జట్టును వరిస్తుందో చూడాలి. టాస్ విషయానికి వస్తే కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఒక మార్పుతో లక్నో జట్టు బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌లో ఆడిన మోషిన్ స్థానంలో ఆండ్రూ టై జట్టులోకి…
ఐపీఎల్‌లో విజయవంతమైన ఆటగాళ్ల జాబితాలో కేఎల్ రాహుల్ కూడా ఉంటాడు. గతంలో పంజాబ్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అతడు ఈ ఏడాది కొత్త టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. మరోవైపు ఇంకో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ తరఫున ఆప్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ బరిలోకి దిగుతున్నాడు. రషీద్ ఖాన్ కూడా ఐపీఎల్‌లో విజయవంతమైన బౌలరే. ఈ నేపథ్యంలో సోమవారం నాడు ఐపీఎల్‌లో ఈ రెండు కొత్త జట్లు తలపడుతున్న వేళ…
ఈ ఏడాది ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు అడుగుపెట్టబోతున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ అందులో ఒకటి. పేపర్ మీద ఈ జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. మరి ప్రధాన టోర్నీలో ఎలా రాణిస్తుందో అన్న విషయం అందరిలోనూ ఆసక్తికరంగా మారింది. రూ.7,090 కోట్లతో సంజీవ్ గోయెంకా ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేశారు. రూ.17 కోట్లు ఖర్చు చేసి కేఎల్ రాహుల్‌ను మెగా వేలం కంటే ముందే తీసుకున్నారు. అంతేకాకుండా కెప్టెన్‌గానూ నియమించారు. మరోవైపు గతంలో కోల్‌కతాకు రెండుసార్లు…
ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకులను ప్రకటించింది. టీమ్ ర్యాంకుల్లో ఇంగ్లండ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక తదుపరి స్థానాల్లో ఉన్నాయి. అటు బౌలర్ల ర్యాంకుల్లో దక్షిణాఫ్రికా స్పిన్నర్ షాంసీ అగ్రస్థానంలో ఉండగా… ఆస్ట్రేలియా పేసర్ హేజిల్‌వుడ్ రెండో స్థానానికి దూసుకెళ్లాడు. శ్రీలంకతో టీ20 సిరీస్‌లో మెరుగ్గా రాణించడంతో అతడు నాలుగు స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. టాప్-10 బౌలర్లలో టీమిండియా నుంచి ఒక్కరు కూడా లేరు. ఇక బ్యాటింగ్ ర్యాంకుల్లో పాకిస్థాన్…
వన్డే సిరీస్‌లో వెస్టిండీస్ జట్టును వైట్‌వాష్ చేసి చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఇక, టీ-20 సిరీస్‌కు సిద్ధం అవుతోంది.. ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ-20 సిరీస్‌లో మొత్తం మూడు మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి భారత్-వెస్టిండీస్ జట్లు.. అయితే, టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు షాక్ తగిలింది.. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ పొట్టి పార్మాట్ సిరీస్‌కు దూరమయ్యారు.. వారి ప్లేస్‌లో రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడాలను జట్టులోకి వచ్చినట్టు బీసీసీఐ…
వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో వ్యక్తిగత కారణాలతో స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ పాల్గొనలేదు. అయితే రెండో వన్డే కోసం అతడు జట్టుతో చేరిపోయాడు. ఈ మేరకు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. కేఎల్ రాహుల్‌తో పాటు మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్, కరోనా నుంచి కోలుకున్న బౌలర్ నవదీప్ సైనీ కూడా జట్టుతో చేరారు. దీంతో బుధవారం జరగనున్న రెండో వన్డేలో టీమిండియా తుది జట్టు ఎంపికపై ఆసక్తి నెలకొంది. Read Also: పలు ఫ్రాంచైజీలు సంప్రదించాయి..…
గత నాలుగేళ్లుగా టీమిండియా మెరుగ్గా రాణిస్తున్నప్పటికీ పరిమిత ఓవర్ల జట్టులో తక్షణమే మార్పులు చేయాలని భారత తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ అభిప్రాయపడ్డాడు. 2023 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని తాము ఆడుతున్నామని… దానికి అనుగుణంగా మెరుగైన జట్టును సిద్ధం చేసుకోవాలన్నాడు. భారత జట్టుకు కెప్టెన్సీ వహించాలన్నది తన కల అని.. అది సాకారమైందని కేఎల్ రాహుల్ అన్నాడు. దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన ఓటమికి ఏదో సాకు చెప్పాలని తాను అనుకోవడం లేదని.. అయితే ఆ ఓటముల…
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో కొత్తగా అడుగుపెట్టబోతున్న లక్నో ఫ్రాంచైజీకి అధికారులు నామకరణం చేశారు. ఇకపై లక్నో ఫ్రాంచైజీని లక్నో సూపర్ జెయింట్స్ అని పిలవనున్నారు. తమ ఫ్రాంచైజీకి పేరును సూచించాలంటూ లక్నో జట్టు సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహించింది. ఈ క్రమంలో లక్నో ఫ్రాంచైజీ అధినేత సంజీవ్ గోయెంకా తమ జట్టు పేరును అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు టీమ్ లోగోను కూడా ఆవిష్కరించారు. అయతే ఈ పేరు గతంలో ఆడిన పూణె జట్టుకు ఉండేది.…