రేపటి నుంచి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. జూన్ 9 నుంచి 19 వరకు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జూన్ 9న తొలి మ్యాచ్ జరగనుంది. అయితే సిరీస్ ప్రారంభానికి ముందే భారత జట్టుకు ఊహించని దెబ్బ తగిలింది. గాయం కారణంగా స్టాండ్ ఇన్ కెప్టెన్ కేఎల్ రాహుల్ జట్టుకు దూరమయ్యాడు. ఇటీవల ఐపీఎల్‌లో మంచి ఫామ్‌ను కనపరిచిన రాహుల్ జట్టుకు దూరం కావడం…
ఏదైనా టోర్నీ జరుగుతున్నప్పుడు లేదా ముగిసిన తర్వాత.. మాజీలందరూ తమతమ ఉత్తమ ఆటగాళ్ళని ఎంపిక చేసుకొని, ఒక బెస్ట్ టీమ్‌ని ప్రకటిస్తుంటారు. ఇప్పుడు ఐపీఎల్-2022 ముగియడంతో.. మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన బెస్ట్ ఎలెవన్‌ను అనౌన్స్ చేశాడు. ఇతను హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా ఎంపిక చేయడం విశేషం. హార్దిక్ సారథ్యం వహించిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఐపీఎల్-2022 ఛాంపియన్స్‌గా నిలిచిన సంగతి తెలిసిందే! ఈ ఏడాది సీజన్‌లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఈ జట్టు.. తొలి…
దక్షిణాఫ్రికాతో జూన్ 9 నుంచి సొంతగడ్డపై జరగనున్న ఐదు టీ20ల సిరీస్ కోసం సెలక్టర్లు భారత జట్టును ప్రకటించారు. ఈ సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రాలకు విశ్రాంతి ఇచ్చారు. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్, వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ను సెలక్టర్లు ప్రకటించారు. ఐపీఎల్‌లో ఆకట్టుకున్న ఆల్‌రౌండర్ హార్డిక్ పాండ్యా, వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‌లకు చాలాకాలం తర్వాత టీమిండియాలో స్థానం లభించింది. హార్డిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడంతో…
క్రికెట్ లో పరుగుల వర్షం కురిపించడంలో మేటి కె.ఎల్.రాహుల్. ఇక అందాలనటి అతియాశెట్టి బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి గారాలపట్టి. రాహుల్, అతియా చెట్టాపట్టాలేసుకొని చాలా రోజులుగా తిరుగుతున్నారు. తమ్ముడు అహన్ శెట్టి నటించే చిత్రోత్సవాలకు ప్రియుడు రాహుల్ తో కలసి వెళ్తోంది అతియా. దీనిని బట్టి ఇరు వైపుల వారి అనుమతి ఈ జంటకు లభించిందనీ జనం భావించారు. ఇక వారి పెళ్ళెప్పుడు అన్న ఆసక్తి చూసేవారికి కలగడం సహజమే కదా! రాహుల్, అతియా వివాహం…
ఐపీఎల్‌లో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ మరోసారి హ్యాట్రిక్ విజయం సాధించింది. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో ఆరు పరుగుల తేడాతో లక్నో టీమ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. కేఎల్ రాహుల్, దీపక్ హుడా హాఫ్ సెంచరీలు చేయడంతో మూడు వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 196 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ…
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా.. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (77), డికాక్ (23) రాణించారు. తొలి వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యం అందించారు. ముఖ్యంగా ఫామ్‌లో ఉన్న రాహుల్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. 51 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్ల సహాయంతో 77 పరుగులు చేసి తన జట్టుకు…
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. దీంతో ముంబై ముందు 169 పరుగుల టార్గెట్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ఆరంభంలో వరుసగా వికెట్లు కోల్పోయింది. అయితే ఓపెనర్ కేఎల్ రాహుల్ మాత్రం వన్ మ్యాన్ షో చేశాడు. 62 బంతుల్లో 103 నాటౌట్‌తో జట్టుకు…
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు రూ.12లక్షలు జరిమానా పడింది. ముంబై ఇండియన్స్‌తో శనివారం సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో స్లోఓవర్ రేట్ కారణంగా కేఎల్ రాహుల్ మ్యాచ్ ఫీజులో కోత పడింది. కాగా ఈ మ్యాచ్‌లో ముంబైపై లక్నో జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సహాయంతో సెంచరీ చేసిన రాహుల్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో తాను ఆడుతున్న వందో…