KL Rahul: టీ20 ప్రపంచకప్‌లో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేస్తే టీమ్‌కు ఉపయోగకరంగా ఉంటుందని ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు సునీల్ గవాస్కర్ తనయుడు రోహన్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల ముగిసిన ఆసియా కప్‌లో ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ రాణించాడని.. టీ20 ప్రపంచకప్‌లో కూడా కోహ్లీని ఓపెనర్‌గా పంపితే ఇతర జట్లు జంకుతాయని రోహన్ గవాస్కర్ చెప్పాడు. భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్ నెం.3లోనే బ్యాటింగ్ చేయాలని, అదే పర్‌ఫెక్ట్ పొజిషన్…
అంతర్జాతీయ క్రికెట్‌లో తన 71వ సెంచరీని పూర్తి చేసిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఈ శతకాన్ని తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ, వారి కుమార్తె వామికకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించాడు.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో గురువారం జరుగుతోన్న ఆసియా కప్ సూపర్ 4 చివరి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ మహ్మద్ నబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ఆసియాకప్‌లో కాసేపట్లో హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. పాకిస్థాన్‌తో కీలక మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో టీమిండియా తరఫున ఓపెనర్లుగా ఎవరు బరిలోకి దిగుతారని విలేకరుల సమావేశంలో కెప్టెన్ రోహిత్ శర్మను అడగ్గా.. టాస్ వేశాక ఎవరు ఓపెనర్లుగా వస్తారో మీరే చూడండి అంటూ రోహిత్ సమాధానం చెప్పాడు. తమకు కొన్ని రహస్యాలు ఉంటాయని.. వాటిని బయటకు చెప్పలేమని స్పష్టం చేశాడు. కొంతకాలంగా టీమిండియా ఓపెనర్లుగా పలు కాంబినేషన్‌లను టీమ్ మేనేజ్‌మెంట్ ప్రయత్నించింది. రోహిత్-సూర్యకుమార్ యాదవ్, రోహిత్-రిషబ్ పంత్, రోహిత్-కేఎల్…
Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీలో ఆదివారం రాత్రికి హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. టీమిండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ప్రతిష్టాత్మక మ్యాచ్ ఆడబోతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇది కెరీర్‌లో 100వ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్. దీంతో అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లలోనూ వంద మ్యాచ్‌లు ఆడిన ఏకైక…
KL Rahul Marraige: టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఈ మేరకు చెట్టాపట్టాలేసుకుని వీళ్లిద్దరూ తిరుగుతున్నారు. దీంతో త్వరలోనే పెళ్లి చేసుకుంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఈ విషయంపై తాజాగా హీరో సునీల్ శెట్టి స్పందించారు. కేఎల్ రాహుల్‌తో తన కుమార్తె అతియా శెట్టి పెళ్లి జరుగుతుందని.. కానీ అది ఇప్పుడే కాదని వెల్లడించారు. ప్రస్తుతం కేఎల్…
Ind Vs Zim: హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 190 పరుగుల విజయ లక్ష్యాన్ని ఊదిపడేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, అక్షర్ పటేల్ తలో 3 వికెట్లు తీసి జింబాబ్వేను కట్టడి చేశారు. ఈ నేపథ్యంలో 190 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఒక్క వికెట్…
KL Rahul: టీమిండియాకు శుభవార్త అందింది. ప్రతిష్టాత్మక ఆసియా కప్ టోర్నీకి ముందు కీలక ఆటగాడు కేఎల్ రాహుల్ అందుబాటులోకి వచ్చాడు. ఈనెల 18 నుంచి జింబాబ్వేతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమైన దృష్ట్యా జింబాబ్వే టూర్‌కు కేఎల్ రాహుల్‌ను పంపాలని సెలక్టర్లు భావించారు. దీంతో జింబాబ్వేలో పర్యటించనున్న టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను ప్రకటించారు. అయితే గతంలో ఈ టూర్‌కు కెప్టెన్‌గా…
Team India Opening Pair: మరో రెండు నెలల్లో టీ20 ప్రపంచకప్ ముంచుకొస్తోంది. అయినా టీమిండియా సెట్ కాలేదు. మిడిలార్డర్, లోయరార్డర్ సంగతి దేవుడెరుగు. ముందు ఓపెనింగ్ జోడీ ఎవరంటే చెప్పలేని దుస్థితి నెలకొంది మన ఇండియా జట్టులో. ఎందుకంటే గత 12 నెలల్లో ఏకంగా 9 మందితో ఓపెనింగ్ జోడీలను టీమిండియా మేనేజ్‌మెంట్ పరీక్షించింది. కొంతమంది విజయవంతం అయినా వాళ్లను కొనసాగించకుండా కొత్తవాళ్లను పరీక్షిస్తూనే ఉంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోనే ఈ వ్యవహారమంతా…