IND vs SL Playing 11 for 3rd ODI: టీ20 సిరీస్‌ను సునాయాసంగా గెలుచుకున్న భారత జట్టుకు వన్డేల్లో మాత్రం ఆతిథ్య శ్రీలంక నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఒక మ్యాచ్ టై చేసుకుని, మరో పోరులో ఓడిన టీమిండియాకు బుధవారం ఆఖరి పరీక్ష ఎదురుకానుంది. శ్రీలంక స్పిన్, స్లో పిచ్‌లకు దాసోహమైన రోహిత్ సేన.. చివరి వన్డేలో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని పట్టుదలగా ఉంది. 2-0తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుని..…
ఆగస్టు 2 నుంచి భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు ఇప్పుడు వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఈ సిరీస్ తొలి వన్డే కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరగనుంది.
Gautam Gambhir does not want to make KL Rahul the India Captain: శ్రీలంక పర్యటనతో హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. కోచ్‌గా భారత జట్టుకు తన అత్యుత్తమ సేవలు అందించాలని గౌతీ భావిస్తున్నాడు. శ్రీలంకతో జరిగే టీ20, వన్డే సిరీస్‌లనే లక్ష్యంగా కాకుండా.. సుదీర్ఘ ప్రణాళికలు రచించాడట. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25ను దృష్టిలో పెట్టుకుని జట్టు కూర్పును సిద్ధం చేస్తున్నాడట.…
క్రికెటర్ కేఎల్.రాహుల్, సతీమణి అతియా శెట్టి ముంబైలో నూతన గృహాన్ని కొనుగోలు చేశారు. బాంద్రాలోని పాలిహిల్ ప్రాంతంలోని రూ.20 కోట్లతో ఇల్లు కొనుగోలు చేశారు.
Hardik Pandya Likely To a India T20 Captain: టీ20 ప్రపంచకప్ 2024 గెలిచి జోష్‌లో ఉన్న భారత్.. జింబాబ్వేపై 4-1తో టీ20 సిరీస్‌ను గెలిచింది. ఇక శ్రీలంక పర్యటనకు సిద్దమవుతోంది. లంకతో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జులై 26 నుంచి టీ20 సిరీస్.. ఆగస్టు 1 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానున్నాయి. అయితే ఈ టూర్‌లో భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
KL Rahul Makes Sensational Comments on Team India Coach Post: టీ20 ప్రపంచకప్ 2024 ముగిసిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగుస్తుంది. నివేదికల ప్రకారం ద్రవిడ్ మరోసారి కోచ్‌గా కొనసాగడానికి ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది. దాంతో కొత్త కోచ్ కోసం బీసీసీఐ వెతుకుతోంది. ఇందుకోసం బీసీసీఐ ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించగా.. మే 27 ఆఖరి గడువు. హెడ్ కోచ్ పదవిని బీసీసీఐ ఎవరితో భర్తీ చేస్తుందనే ఆసక్తి అందరిలో…
KL Rahul Funny Comments on Dream11 Ad with Suniel Shetty: ఐపీఎల్ 2024 ముగిసిందని, ఇక తన మామ సునీల్ శెట్టి టీమ్‌కు వెళ్తున్నా అని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సరదాగా అన్నాడు. టీ20 ప్రపంచకప్ 2024లో ‘శర్మాజీ కా బేటా’ కోసం ప్రచారం చేయాలని రాహుల్ చెప్పకనే చెప్పాడు. ఐపీఎల్ 2024 కోసం సునీల్ శెట్టి, రోహిత్ శర్మతో కలిసి రాహుల్ డ్రీమ్ 11 యాడ్ షూట్ చేశాడు.…
KL Rahul on LSG Defeat vs DC: పవర్ ప్లేలో కీలక వికెట్లను చేజార్చుకోవడమే ఈ సీజన్‌లో తమను దెబ్బ కొట్టిందని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు. మంచి ఆరంభాలు ఇవ్వలేకపోవడమే పాయింట్ల పట్టికలో వెనకపడ్డానికి కారణం అని చెప్పాడు. చివరి మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంటాం అని రాహుల్ ధీమా వ్యక్తం చేశాడు. మంగళవారం ఢిల్లీ చేతిలో లక్నో ఓడిపోయింది. ఈ ఓటమితో ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం…
సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జేయింట్స్ ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో.. 165 పరుగులు చేసింది. ఈ క్రమంలో.. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ ఒక్క వికెట్ కోల్పోకుండా విజయం సాధించింది. ఈ క్రమంలో.. లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా కెప్టెన్ కేఎల్ రాహుల్ పై విరుచుకుపడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కేఎల్ రాహుల్‌పై బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేసినందుకు సంజీవ్ గోయెంకాపై టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మండిపడ్డారు. లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి తర్వాత ఆవేశానికి లోనైన జట్టు యజమాని సంజీవ్ గోయెంకా.. కెమెరా ముందే మాట్లాడటం సరైంది కాదనే అభిప్రాయం క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. సోషల్ మీడియాలోనూ గోయెంకా తీరుపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో కేఎల్ రాహుల్‌కు షమీ మద్దతుగా నిలిచాడు.