KL Rahul: టీమిండియాలో పెద్ద ఎత్తున రాజకీయాలు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KL Rahul Makes Sensational Comments on Team India Coach Post: టీ20 ప్రపంచకప్ 2024 ముగిసిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగుస్తుంది. నివేదికల ప్రకారం ద్రవిడ్ మరోసారి కోచ్‌గా కొనసాగడానికి ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది. దాంతో కొత్త కోచ్ కోసం బీసీసీఐ వెతుకుతోంది. ఇందుకోసం బీసీసీఐ ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించగా.. మే 27 ఆఖరి గడువు. హెడ్ కోచ్ పదవిని బీసీసీఐ ఎవరితో భర్తీ చేస్తుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ప్రస్తుతానికి కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్, జస్టిన్ లాంగర్, రికీ పాంటింగ్, గౌతమ్ గంభీర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే టీమిండియా కోచ్ పదవిపై విదేశీ మాజీలు పెద్దగా ఆసక్తి చూపించట్లేదట. అందుకు కారణాలు లేకపోలేదు.
టీమిండియాకు హెడ్ కోచ్‌గా ఉంటే.. కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపలేమని రికీ పాంటింగ్ చెప్పాడు. స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా అదే కారణం చెప్పాడు. అయితే లక్నో సూపర్ జెయింట్స్ కోచ్ జస్టిన్ లాంగర్ చెప్పిన కారణం మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టీమిండియా కోచ్‌గా బాధ్యతలు చేపడితే.. ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ తనకు చెప్పాడని ఓ బాంబు పేల్చాడు. భారత జట్టులో ఐపీఎల్ కంటే వెయ్యి రెట్ల ఒత్తిడి, పాలిటిక్స్ ఉంటాయని రాహుల్ తనకు చెప్పాడని లాంగర్ పేర్కొన్నాడు.
Also Read
Also Read: Keerthy Suresh Lip Lock: లిప్ లాక్‌కి ఓకే చెప్పిన కీర్తి సురేష్.. ఆ పెళ్లయిన హీరోకి పండగే!
బీబీసీ స్టంప్డ్ పాడ్‌కాస్ట్‌లో ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ… ‘భారత జట్టు కోచ్ పదవి అద్భుతమైనది. కానీ నేను పోటీలో ఉండట్లేదు. టీమిండియా కోచ్ పదవి అందరినీ ఆకట్టుకునే పాత్ర అని నాకు తెలుసు. ఆస్ట్రేలియా జట్టుతో నాలుగేళ్లు పని చేశా. నిజాయితీగా చెప్పాలంటే నేను చాలా అలసిపోయా. భారత జట్టులో అధిక ఒత్తిడి ఉంటుంది. నేను కేఎల్ రాహుల్‌తో మాట్లాడాను. ‘ఐపీఎల్‌లో ఒత్తిడి, రాజకీయాలు ఉన్నాయని మీకు తెలుసు. దానికి వెయ్యి రెట్లు అక్కడ ఉంటుంది’ అని రాహుల్ చెప్పాడు. ఇదో మంచి సలహా. టీమిండియా కోచ్ మంచి జాబే, కానీ నాకు కాదు’ అన్నాడు. రాహుల్ చేసిన సంచలన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతున్నాయి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు