IND vs SL: నేడు శ్రీలంకతో భారత్ మూడో వన్డే.. సమం చేస్తారా? భారత తుది జట్టులో మార్పులు
- శ్రీలంకతో భారత్ మూడో వన్డే
- మధ్యాహ్నం 2:30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
- భారత తుది జట్టులో మార్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs SL Playing 11 for 3rd ODI: టీ20 సిరీస్‌ను సునాయాసంగా గెలుచుకున్న భారత జట్టుకు వన్డేల్లో మాత్రం ఆతిథ్య శ్రీలంక నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఒక మ్యాచ్ టై చేసుకుని, మరో పోరులో ఓడిన టీమిండియాకు బుధవారం ఆఖరి పరీక్ష ఎదురుకానుంది. శ్రీలంక స్పిన్, స్లో పిచ్‌లకు దాసోహమైన రోహిత్ సేన.. చివరి వన్డేలో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని పట్టుదలగా ఉంది. 2-0తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుని.. టీ20 ఫార్మాట్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని శ్రీలంక భావిస్తోంది. నేటి మధ్యాహ్నం 2:30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో మూడో వన్డే మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.
గత రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఓడడానికి ప్రధాన కారణం బ్యాటింగ్ వైఫల్యం. శ్రీలంక స్పిన్‌ను ఆడలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు. రోహిత్ శర్మ మినహా మరే బ్యాటర్ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. విరాట్ కోహ్లీ (24, 14), కేఎల్ రాహుల్ (31, 0), శ్రేయస్ అయ్యర్ (23, 7) రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమయ్యారు. శుబ్‌మన్ గిల్ పరుగులు చేయాల్సి ఉంది. ఇక శివమ్ దూబే దారుణంగా విఫలమయ్యాడు. దాంతో రాహుల్, దూబే స్థానాల్లో రిషభ్ పంత్, రియాన్ పరాగ్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ రాణిస్తున్నారు.
Also Read
టి20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌తో పరువు పోగొట్టుకున్న ఆతిథ్య శ్రీలంక వన్డే సిరీస్‌ను కొట్టాలనే పట్టుదలతో ఉంది. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై లంక బౌలర్లు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. రెండో వన్డేలో వాండర్సె 6 వికెట్స్ తీశాడు. స్పిన్‌తో పటిష్టమైన భారత్ బ్యాటింగ్ లైనప్‌ను తేలిగ్గా కూల్చేస్తున్నారు. చివరి వన్డేలోనూ స్పిన్‌తో దెబ్బకొట్టాలని చూస్తోంది. అసలంక, నిసాంక, ఫెర్నాండో, మెండిస్ బ్యాటింగ్లో రాణిస్తున్నారు. కొలంబో పిచ్ స్పిన్‌కు స్వర్గధామం. మ్యాచ్‌కు వర్ష సూచన ఉన్నా.. ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు.
Also Read: Vinesh Phogat-Gold Medal: గోల్డ్ మెడల్ తీసుకువస్తా.. మాటిచ్చిన వినేశ్ ఫొగాట్!
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్/రిషభ్ పంత్, రియాన్ పరాగ్/శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.
శ్రీలంక: చరిత్ అసలంక (కెప్టెన్), నిసాంక, ఆవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, సమరవిక్రమ, లియనాగె, వెల్లలాగె, కమిందు మెండిస్, అకిల దనంజయ, వాండర్సె, అసిత్ ఫెర్నాండో.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?