Union Minister Kishan Reddy Speech At Alluri Sitarama Raju Jayanthi Utsav
మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు 125వ జయంతిని పురస్కరించుకొని ఏపీలోని భీమవరంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల సీతారామ రాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా భీమవరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగం సభలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న నేపథ్యంలో… ప్రధాని మోడీ అజాద్ ది అమృత్ మహోత్సవం కార్యక్రమం నిర్వహించ తలపెట్టారు. ఈ కార్యక్రమంలో స్వాతంత్ర్య సమర యోధులను గుర్తు చేసకోవడం మన అదృష్టమన్నారు. ఆ స్వాతంత్ర్య సమరయోధుల్లో మన తెలుగువాడు అల్లూరి సీతారామరాజు ఉండడం మన పూర్వజన్మ సుకృతమన్నారు. నేటి యువత అల్లూరిని స్పూర్తిగా తీసుకోవాలన్నారు. ఆనాడు ఆయన బ్రిటిష్ వారిపై చెప్పి మరీ దాడి చేశారని, బ్రిటిష్ పోలీస్ స్టేషన్‌పై దాడి చేస్తామని లెటర్ పంపి మరీ దాడి చేశారన్నారు.
అయితే.. భారత ప్రభుత్వం తరుఫున తెలుగు పౌరుషానికి ప్రతీక అయిన అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి ఉత్సవాలు జరుపుకోరానన్నారు. అంతేకాకుండా అల్లూరి సీతారామ రాజు పెరిగిన భీమవరానికి రావాలని కోరానన్నారు. దానికి ఏమాత్రం ఆలోచించకుండా ప్రధాని మంత్రి అంగీకరించారన్నారు. అల్లూరి ఎక్కడెక్కడ తిరిగాడో అక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి తీర్థయాత్ర కేంద్రాలుగా తీర్చిదిద్దబోతున్నట్లు ఆయన తెలిపారు. అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యలను సైతం కలుస్తామని కిషన్‌రెడ్డి వెల్లడించారు. అల్లూరి సైన్యం కుటుంబాలను సైతం కలుస్తామన్నారు.