మార్చి 25న ‘భీమ్లా నాయక్’ విడుదల అవుతుండటంతో సహజంగానే ఆ రోజున రావాల్సిన ఇతర చిత్రాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి. శర్వానంద్ మూవీ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ను మార్చి 4న విడుదల చేయబోతున్నట్టు శనివారం ప్రకటించారు. అలానే ఇప్పుడు కిరణ్ అబ్బవరం ‘సెబాస్టియన్ పీసీ 524’ విడుదల సైతం మార్చి 4వ తేదీకి వాయిదా పడినట్టు నిర్మాతలు కొత్త పోస్టర్ తో తెలిపారు. విశేషం ఏమంటే… ‘గని’ నిర్మాతలు మాత్రం విడుదల తేదీపై పెదవి విప్పడం లేదు.…
‘సెబాస్టియన్ పీసీ 524’ ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదల కానుంది. కిరణ్ అబ్బవరం తన కెరీర్‌లో తొలిసారిగా ఈ చిత్రంలో పోలీసుగా నటించారు. ‘రాజా వారు రాణి వారు’లో లవర్ బాయ్‌గా, ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’లో కాలేజ్ బాయ్ గా నటించిన కిరణ్ ఇప్పుడు రాత్రి అంధత్వంతో బాధపడే యువ పోలీసు పాత్రను పోషించాడు. కథ మదనపల్లెలో జరుగుతుంది. తాజాగా “సెబాస్టియన్ పీసీ 524” టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. దర్శకుడు బాలాజీ…
‘రాజావారు రాణి గారు’ చిత్రంతో హీరోగా పరిచయం అయిన కిరణ్ అబ్బవరం గత ఏడాది ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’తో కమర్షియల్ సక్సెస్ సాధించాడు. దాంతో నాలుగైదు సినిమాలలో అతనికి హీరోగా నటించే ఛాన్స్ దక్కింది. అగ్ర నిర్మాణ సంస్థలు సైతం ఇప్పుడు కిరణ్ అబ్బవరంతో సినిమాలు నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉంటే కిరణ్ అబ్బవరం నటించిన మూడో చిత్రం ‘సెబాస్టియన్ పి.సి. 524’ విడుదల తేదీని నిర్మాతలు ప్రమోద్, రాజు మంగళవారం ప్రకటించారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ…
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాతగా, కిరణ్ అబ్బవరం, కశ్మీరా పర్ధేశీ జంటగా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అనే పేరుతో కొత్త సినిమా శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఫిల్మ్ నగర్ లోని దైవ సన్నిధానంలో ఈ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్ ముఖ్య అతిధిగా హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కిరణ్ అబ్బవరం, కశ్మీరా పర్ధేశీ పై అల్లు అన్విత క్లాప్ నివ్వగా,…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు అయ్యింది. ‘రాజావారు రాణిగారు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం నటించిన సెకండ్ మూవీ ‘ఎస్. ఆర్. కళ్యాణ్ మండపం’ గత యేడాది ఆగస్ట్ లో విడుదలైంది. డీసెంట్ హిట్ అందుకున్న ఈ సినిమా తర్వాత కిరణ్ అబ్బవరంకు పెద్ద సంస్థల నుండి అవకాశాలు రావడం విశేషం. Read Also : మళ్ళీ తెరపైకి అనుష్క… జులన్ గోస్వామి బయోపిక్ కు రెడీ !…
‘రాజావారు రాణిగారు’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమై ఆనతి కాలంలోనే మంచి ట్యాలెంట్ ఉన్న హీరో అని అనిపిచ్చుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈ సినిమా తరువాత ‘ఎస్ఆర్ కల్యాణమండపం’ చిత్రంతో కుర్రాళ్లను అభిమానులుగా మార్చేసుకున్న కిరణ్ తాజాగా ‘సమ్మతమే’ చిత్రంతో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఇకపోతే ఇటీవలే ఈ యంగ్ హీరో ఇంట్లో విషాదం జరిగిన సంగతి తెలిసిందే. తన అన్న రామాంజులు రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇక తాజాగా సోదరుడి మరణాన్ని తట్టుకోలేకపోతున్నా…
ఇండస్ట్రీలో చోటు చేసుకుంటున్న వరుస విషాదాలు తెలుగు ప్రేక్షకులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. చాలా తక్కువ వ్యవధిలోనే శివశంకర్ మాస్టర్, లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రిని పోగొట్టుకుంది ఇండస్ట్రీ. ఈ విషాదాల నుంచి ఇంకా తేరుకోకముందే మరో టాలీవుడ్ యంగ్ హీరో ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. హీరో అబ్బవరం కిరణ్ సోదరుడు రామాంజులు రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు తాజా సమాచారం. కడప జిల్లా చెన్నూరు వద్ద రోడ్డు ప్రమాదం జరగగా, తీవ్రంగా గాయపడిన…
‘రాజా వారు-రాణీగారు’, ‘ఎస్ఆర్ కల్యాణ మండపం’ చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రామిసింగ్ కథానాయకుడు కిరణ్ అబ్బవరం హీరోగా సోమవారం హైదరాబాద్‌లో ఓ నూతన చిత్రం ప్రారంభమైంది. అగ్ర కథానాయకులతో, స్టార్ డైరక్టర్లతో సినిమాలు నిర్మిస్తూ అగ్ర నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న మైత్రీ మూవీమేకర్స్, ఇటీవల ‘మత్తు వదలరా’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని నిర్మించిన క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రముఖ దర్శకులు కేఎస్ రవీంద్ర (బాబీ),…
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం విలక్షణమైన సబ్జెక్ట్‌లను సెలెక్ట్ చేసుకుంటూ తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్నారు. తన మొదటి రెండు చిత్రాలతో కమర్షియల్ హిట్స్ సాధించిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “సమ్మతమే”తో వస్తున్నాడు. గోపినాథ్ రెడ్డి దర్శకత్వంలో చాందిని చౌదరి హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ ను విడుదల చేశారు మేకర్స్. Read Also : “పుష్ప” ట్రైలర్…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా కలిసి నటిస్తున్న రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ “సమ్మతమే”. ఈ ప్రత్యేకమైన రొమాంటిక్ ఎంటర్టైనర్కు గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించారు. యుజి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కంకణాల ప్రవీణ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో హీరో హీరోయిన్లను, వారి క్యారెక్టర్లను పరిచయం చేశారు మేకర్స్. Read Also : విజయ్ దేవరకొండ, దిల్ రాజు మైండ్ బ్లోయింగ్…