వినరో భాగ్యము విష్ణు కథ’ అంటున్న కిరణ్ అబ్బవరం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాతగా, కిరణ్ అబ్బవరం, కశ్మీరా పర్ధేశీ జంటగా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అనే పేరుతో కొత్త సినిమా శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఫిల్మ్ నగర్ లోని దైవ సన్నిధానంలో ఈ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్ ముఖ్య అతిధిగా హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కిరణ్ అబ్బవరం, కశ్మీరా పర్ధేశీ పై అల్లు అన్విత క్లాప్ నివ్వగా, బన్నీవాసు కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సినిమాతో మురళి కిషోర్ అబ్బూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గతంలో ప్రఖ్యాత దర్శకులు ప్రశాంత్ నీల్, కిషోర్ తిరుమల దగ్గర మురళీ కిశోర్ వర్క్ చేశారు. కథానాయిక కశ్మీరా పర్దేశీ ఇంతకు ముందు నాగశౌర్య సరసన ‘నర్తనశాల’ చిత్రంలో నటించింది.
జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ‘పిల్లా నువ్వు లేని జీవితం, భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రాలు చక్కని విజయాన్ని అందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వినూత్నమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు నిర్మాత బన్నీవాసు తెలిపారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు చైతన్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చుతున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్, విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతగా బాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా సత్య గమిడి, శరత్ చంద్ర నాయుడు వ్యవహరిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!