‘సెబాస్టియన్ పీసీ 524’ ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదల కానుంది. కిరణ్ అబ్బవరం తన కెరీర్‌లో తొలిసారిగా ఈ చిత్రంలో పోలీసుగా నటించారు. ‘రాజా వారు రాణి వారు’లో లవర్ బాయ్‌గా, ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’లో కాలేజ్ బాయ్ గా నటించిన కిరణ్ ఇప్పుడు రాత్రి అంధత్వంతో బాధపడే యువ పోలీసు పాత్రను పోషించాడు. కథ మదనపల్లెలో జరుగుతుంది. తాజాగా “సెబాస్టియన్ పీసీ 524” టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. దర్శకుడు బాలాజీ సయ్యపురెడ్డి నైట్ ఎఫెక్ట్ సన్నివేశాలను చాలా బాగా తెరకెక్కించారు.
Read Also : బీచ్ వేర్ లో హీట్ పెంచేస్తున్న పూజాహెగ్డే
నైట్-ఎఫెక్ట్ విజువల్స్‌లో హీరో జీవితంలో ఎదురయ్యే కష్టాలను మనం చూడొచ్చు. ‘సెబాస్టియన్’లో లవ్‌ట్రాక్ ఎలిమెంట్ కూడా ఉన్నట్టుగా కన్పిస్తోంది. నమ్రత దారేకర్, కోమలీ ప్రసాద్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ రాజ్ కె నెల్లి విజువల్స్ అందించగా, జిబ్రాన్ సంగీతం అందించారు. ఇంకా ఆదర్శ్ బాలకృష్ణ, రోహిణి, శ్రీకాంత్ అయ్యంగార్, జార్జ్, సూర్య, మహేష్ విట్టా, రవితేజ, రాజ్ విక్రమ్, లత, ఇషాన్, రాజేష్, శివ ఈ సినిమాలో నటించారు. టీజర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.