మార్చి 25న ‘భీమ్లా నాయక్’ విడుదల అవుతుండటంతో సహజంగానే ఆ రోజున రావాల్సిన ఇతర చిత్రాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి. శర్వానంద్ మూవీ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ను మార్చి 4న విడుదల చేయబోతున్నట్టు శనివారం ప్రకటించారు. అలానే ఇప్పుడు కిరణ్ అబ్బవరం ‘సెబాస్టియన్ పీసీ 524’ విడుదల సైతం మార్చి 4వ తేదీకి వాయిదా పడినట్టు నిర్మాతలు కొత్త పోస్టర్ తో తెలిపారు. విశేషం ఏమంటే… ‘గని’ నిర్మాతలు మాత్రం విడుదల తేదీపై పెదవి విప్పడం లేదు. గతంలో వారు ఏప్రిల్ 25 లేదంటే మార్చి 4న తమ చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు. మరి ఇప్పుడు మార్చి 4వ తేదీకి కట్టుబడి ఉంటారా? మరింత వెనక్కి వెళతారా? అనేది తెలియాల్సి ఉంది.
Read also : Megastar Wedding Anniversary : స్పెషల్ వెకేషన్ ప్లాన్
ఈ వారంతంలో స్ట్రయిట్ తెలుగు సినిమా ‘భీమ్లా నాయక్’తో పాటు తమిళ అనువాద చిత్రం ‘వలీమై’, హిందీ డబ్బింగ్ సినిమా ‘గంగూభాయి కఠియావాడి’ విడుదల కాబోతున్నాయి. ఒక్కసారి ‘భీమ్లా నాయక్’ విడుదల తేదీ ఖరారు కాగానే… సోషల్ మీడియాలో ఆ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న న్యూస్ వైరల్ అవుతోంది. గత యేడాది వచ్చిన ‘వకీల్ సాబ్’ రికార్డులను ‘భీమ్లా నాయక్’ సునాయాసంగా బద్దలు కొడుతుందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. విశేషం ఏమంటే ‘వకీల్ సాబ్’ హిందీ చిత్రానికి రీమేక్ కాగా, ఈ ‘భీమ్లా నాయక్’ మలయాళ చిత్రానికి రీమేక్!