Gun Fire : హైదరాబాద్, గుడిమల్కాపూర్‌లోని కింగ్స్ ప్యాలెస్‌లో నిర్వహించిన ఆనం మీర్జా ఎక్స్పోలో కాల్పుల కలకం చోటుచేసుకుంది. ఎక్స్పోలో ఇద్దరు షాప్ కీపర్‌ల మధ్య వాగ్వాదం తలెత్తి తీవ్ర స్థాయికి చేరుకుంది. తీవ్ర వాగ్వాదం అనంతరం, వారిలో ఒకరు గాలిలో కాల్పులు జరపడంతో అక్కడున్న వారిలో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. కాల్పుల శబ్దంతో సందడి నెలకొనగా, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు గాలిలో కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని…