King Cobra: హిమాలయాలు, ముఖ్యంగా ఎవరెస్ట్ పర్వతాలకు సమీపంలో విషపూరిత పాములు కనిపించడం శాస్త్రవేత్తల్ని కలవరపరుస్తోంది. నేపాల్ లోని ఎవరెస్ట్ శిఖరం సమీపంలో ఒకటిన్నర నెలల వ్యవధిలో 10 విషపూరిత పాములు, ఇందులో 09 కింగ్ కోబ్రా పాములను పట్టుకున్నారు. ఇలా అత్యంత శీతల ప్రాంతంలో కింగ్ కోబ్రా పాములు కనిపించడంపై సైంటిస్టులు ఆందోళన చెందుతున్నారు. ఈ పాములను నాలుగు వేర్వేరు ప్రాంతాలు గోపాలేశ్వర్, భంజ్యాంగ్, సోఖోల్, ఫుల్‌చౌక్ ప్రాంతాల నుండి- రక్షించినట్లు దక్షిణ్ కాళి మునిసిపాలిటీ…