US-Venezuela: రక్తపిపాసి గ్యాంగ్ లీడర్ నినో గెర్రెరో హతం.. ట్రంప్ సంచలన ప్రకటన
- రక్తపిపాసి గ్యాంగ్ లీడర్ నినో గెర్రెరో హతం
- అమెరికా ఆపరేషన్‌లో కీలక నేరస్థుడు ఖతం
- ట్రంప్ సంచలన ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెనిజులాకు చెందిన ప్రఖ్యాత నేర ముఠా ట్రెన్ డి అరాగువా నాయకుడు హెక్టర్ రుస్తెన్‌ఫోర్డ్ గెర్రెరో ఫ్లోరెస్ అలియాస్ ‘నినో గెర్రెరో’ హతమైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా సదర్న్ కమాండ్, వెనిజులా భద్రతా బలగాల సమన్వయంతో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో అతడిని అంతమొందించినట్లు తెలిపారు.
ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ట్రంప్.. “నా ఆదేశాల మేరకు అమెరికా సదర్న్ కమాండ్ వేగవంతమైన, అత్యంత కచ్చితమైన దాడి నిర్వహించి ట్రెన్ డి అరాగువా నాయకుడు నినో గెర్రెరోను హతమార్చింది. ప్రపంచంలోని అత్యంత రక్తపిపాసి ఉగ్ర సంస్థల్లో ఇది ఒకటి” అని పేర్కొన్నారు.
Also Read
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
- Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
- Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
అమెరికా మోస్ట్ వాంటెడ్ నేరస్థుడు
అమెరికా ప్రభుత్వం ట్రెన్ డి అరాగువా ముఠాను ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. డ్రగ్స్ అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా, వసూళ్లు, కిడ్నాప్‌లు, హత్యలు వంటి అనేక నేరాల్లో ఈ ముఠా ప్రమేయం ఉందని ఆరోపిస్తోంది. గెర్రెరో ఫ్లోరెస్‌పై అమెరికాలో రాకెటీరింగ్ కుట్ర సహా పలు కేసులు నమోదయ్యాయి. అతని అరెస్టుకు సంబంధించిన సమాచారానికి 5 మిలియన్ డాలర్ల వరకు బహుమతి కూడా ప్రకటించారు.
వెనిజులా కూడా ధృవీకరణ
బొలివార్ రాష్ట్రంలో నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో నినో గెర్రెరో మృతి చెందినట్లు వెనిజులా అధికారులు కూడా ధృవీకరించారు. అయితే అమెరికా సైన్యం ప్రత్యక్షంగా పాల్గొన్న విషయంపై అమెరికా, వెనిజులా వర్గాల వివరణల్లో స్వల్ప భేదాలు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
జైలు నుంచి అంతర్జాతీయ నేర సామ్రాజ్యం
ట్రెన్ డి అరాగువా ముఠా వెనిజులాలోని టోకోరాన్ జైలు నుంచి పుట్టుకొచ్చింది. నినో గెర్రెరో అక్కడి నుంచే తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించి లాటిన్ అమెరికాలో అత్యంత భయంకరమైన నేర ముఠాల్లో ఒకటిగా మార్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ గ్యాంగ్ సభ్యుల సంఖ్య 2,500 నుంచి 5,000 మధ్య ఉంటుందని అంచనా.
ట్రంప్ వ్యాఖ్యలు
ఈ ఆపరేషన్ అమెరికా భద్రతకు ముప్పుగా భావిస్తున్న అంతర్జాతీయ నేర సంస్థలపై తమ కఠిన వైఖరిని చాటుతుందని ట్రంప్ పేర్కొన్నారు. “ట్రెన్ డి అరాగువా ఉగ్రవాదులకు ఇక వెనిజులాలో కానీ, ప్రపంచంలో ఎక్కడా కానీ సురక్షిత స్థలం లేదు” అని హెచ్చరించారు.
“At my direction, the United States Southern Command delivered a swift and lethal kinetic strike to successfully execute Niño Guerrero, the infamous leader of Tren De Aragua, one of the most bloodthirsty Terrorist Organizations on Planet Earth.” – President DONALD J. TRUMP 🇺🇸 pic.twitter.com/3R5IPxhPXX
— The White House (@WhiteHouse) June 13, 2026
తాజావార్తలు
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!