Father Killed his Son’s Family in Kerala: కన్న తండ్రి మమకారం మరిచి కసాయిలా మారిపోయాడు. ఇంట్లో జరిగే గొడవలు ఎక్కడైనా సహజం అని తెలిసినా ఆ వ్యక్తి విచక్షణా కోల్పొయాడు. కన్న కొడుకు మీదే పగ తీర్చుకోవాలనుకున్నాడు. దీంతో ఆ వ్యక్తి కన్న కొడుకు కుటుంబాన్నే కడతేర్చాడు. నిద్రిస్తున్న వారి మీద పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో కొడుకు, మనవడు చనిపోగా కొడలు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. ఈ ఘటన కేరళలోని త్రిసూర్ జిల్లాలో…
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా మట్ బేడ అటవీ ప్రాంతంలో సోమవారం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక మావోయిస్టు హతమయ్యాడు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. శానిటైజర్ లో విషపదార్థాలు కలిపి ఓ విద్యార్థినికి తాగించి హత్య చేశాడు. అయితే అంతకుముందు విద్యార్థిని వెంటపడుతుండటంతో.. విద్యార్థిని పడొద్దు అని చెప్పింది. దీంతో ఈ దారుణ ఘటనకు పాల్పడ్డాడు.
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో ఓ దారుణ ఘటన చోటు చోటుచేసుకుంది. తన ఇంటికి వచ్చిన ఓ వ్యక్తిని యువకుడు గొడ్డలితో నరికి చంపాడు. కొడుకుకి, తల్లికి మధ్య గొడవ జరుగుతుండగా.. దాన్ని పరిష్కరించేందుకు వచ్చిన వ్యక్తిని కిరాతకంగా చంపాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లో ఓ యువకుడు తన ప్రియురాలిని గొంతుకోసి హత్య చేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. కేవలం 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి వివరాలను బయటపెట్టారు.
2022లో ఇంగ్లండ్‌లో సిక్కు ట్యాక్సీ డ్రైవర్‌కు చెల్లింపుల విషయంలో జరిగిన వాగ్వాదం తర్వాత యువకుడు హత్యకు గురయ్యాడు. లండన్‌లో జరిగిన ఈ హత్యకేసు నిందితుడికి శిక్ష పడింది. టాక్సీ డ్రైవర్ పేరు అంఖ్ సింగ్ (59). టోమాజ్ మార్గోల్ (36) అనే వ్యక్తి హత్య చేసి దోషిగా నిర్ధారించబడ్డాడు. సింగ్ హత్యకు సంబంధించి అతను ఈ వారం వోల్వర్‌హాంప్టన్ క్రౌన్ కోర్టులో నేరాన్ని అంగీకరించాడు.
Love Marriage : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కూతురి ప్రేమను ఒప్పుకోలేని తండ్రి ఆమెను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. కూతరు ప్రేమ పెళ్లి విషయంలో తండ్రితో గొడవ పెట్టుకుంది.
Indo American: కొడుక్కి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్న కోడలిపై కక్ష పెంచుకున్నాడు మామ. అమెరికాలోని కాలిఫోర్నియా మాల్ పార్కింగ్ లాట్లో కోడల్ని చంపిన కేసులో భారత సంతతికి చెందిన వృద్ధుడిని పోలీసులు అరెస్టు చేశారు. శాంజోస్‌లో సెప్టెంబరు 30న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు గురుప్రీత్ కౌర్ దోసాంజ్ శాంజోస్ వాల్‌మార్ట్‌లో పనిచేస్తుండగా.. 150 మైళ్ల దూరంలో ఉన్న తన కోడల్ని వెదుక్కుంటూ వచ్చిన ఆ వ్యక్తి తుపాకితో కాల్చి చంపినట్టు తెలుస్తోంది.…