The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యాచురల్ స్టార్ నాని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’. SLV బ్యానర్‌పై సుధాకర్ చేరుకూరి ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు.. ‘ది ప్యారడైజ్’ ప్రపంచవ్యాప్త థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకోవడం కోసం ఏకంగా రూ. 110 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగింది. నాని కెరీర్లోనే ఇది అత్యంత భారీ ఆఫర్ కావడంతో ఈ న్యూస్ కాస్తా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.
అయితే ఈ రూమర్లపై శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ ప్రొడ్యూసర్ సుధాకర్ చేరుకూరి స్పందింస్తూ ‘ ప్యారడైజ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌కి సంబంధించి వస్తున్న పుకార్లను దయచేసి ఎవరూ నమ్మకండి. ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి నిజమైన వార్త అయినా సరే నేరుగా మా అధికారిక సోషల్ మీడియా పేజీల ద్వారా మాత్రమే వస్తుంది” అని క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రకటనతో ‘ది ప్యారడైజ్’ బిజినెస్ డీల్‌పై వస్తున్న రూమర్లకు మేకర్స్ ఎండ్ కార్డ్ వేసినట్లయింది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. గతంలో ‘దసరా’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కాంబో కావడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. జెట్ స్పీడ్ లో షూటింగ్ చేస్తున్న ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 24న రిలీజ్ కానుంది.
Also Read
తాజావార్తలు
-
Dharmana Prasada Rao: స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఏం చేస్తారో చూపించండి.. ధర్మాన సవాల్
-
India vs Pakistan: “అసలు మజా అప్పుడే”.. దాయాదుల మధ్య పసిడి పోరు..
-
Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
-
Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!