కిడ్నీ రాకెట్ కేసులో మొత్తం 15 మంది నిందితులు ఉన్నారు. ఏడుగురు అరెస్ట్ ఎనిమిది మంది పరారీలో ఉన్నట్లు సీపి సుధీర్ బాబు తెలిపారు. శనివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. "అరెస్ట్ అయినవారిలో జనరల్ సర్జన్ డాక్టర్ సిద్ధంశెట్టి అవినాష్, అలకనంద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ గుంటుపల్లి సుమంత్ కర్ణాటకకు చెందిన మధ్యవర్తి ప్రదీప్‌లతో పాటు ఆస్పత్రి సిబ్బంది గోపి, రవి, రవీందర్, హరీష్, సాయిలును అరెస్ట్ చేశాం.
కిడ్నీ రాకెట్ కేసులో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. కిడ్నీ ఆపరేషన్ కోసం వసూలు చేసిన హాస్పిటల్ కోఆర్డినేటర్ అనిల్కు హాస్పిటల్కు ఎటువంటి సంబంధం లేదని హాస్పిటల్ యాజమాన్యం తేల్చి చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. హాస్పిటల్లో పనిచేసిన అంత మాత్రాన హాస్పిటల్ కి ఏంటి సంబంధం అని అంటున్నారు యాజమాన్యం. అనిల్ ఆర్థిక లావాదేవీలకు తమకు ఎటువంటి సంబంధం లేదని, అనిల్ పాత్ర పై తమకు అనుమానాలు ఉన్నాయి అంటున్నారు.