Kia Clavis: కియా మోటార్స్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన 3 వరుసల రిక్రియేషనల్ వెహికల్ కియా క్లావిస్ (Kia Clavis) నేడు (మే 8) భారత్‌లో అధికారికంగా విడుదల అయ్యింది. ఇది కియా క్యారెన్స్ కంటే అగ్రస్థానంలో ఉండే ప్రీమియమ్ మోడల్‌గా మార్కెట్‌లోకి వచ్చింది. ఇక ఈ కారు సంబంధించి అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించకపోయినప్పటికీ, కొన్ని కియా డీలర్‌షిప్‌ల వద్ద బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ వాహనం సిల్వర్ గ్లాస్, ప్యూటర్ ఆలివ్, ఇంపీరియల్ బ్లూ, గ్లేసియర్ వైట్ పెర్ల్,…
దక్షిణ కొరియా కార్ల తయారీదారు కియా జనవరిలో జరిగిన ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కియా ఈవీ6ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కారు ఫేస్‌లిఫ్ట్ మోడల్ అధికారికంగా భారత మార్కెట్లో అమ్మకానికి విడుదల చేసింది. కంపెనీ దీనిని GT-Line AWD అనే ఒకే ఒక వేరియంట్‌లో ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధర రూ. 65.9 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.
దక్షిణకొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియా తన ఎలక్ట్రిక్ కారు ఈవీ6 ను రికాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. 1,380 యూనిట్లను స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ యూనిట్లను 3 మార్చి 2022, 14 ఏప్రిల్ 2023 మధ్య తయారు చేసిన కార్లను రికాల్ చేయనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH)కి సమాచారం అందించింది.
Kia Syros : కొత్త మోడల్ కార్లను మార్కెట్లోకి రిలీజ్ చేయడంలో కియా కంపెనీ ఎప్పుడూ ముందుంటుంది. కియా కొత్త ఎస్ యూవీ కియా సైరోస్ త్వరలో భారత మార్కెట్లో వినియోగదారుల కోసం విడుదల కానుంది.
Kia Syros: భారతదేశంలో ఆటోమొబైల్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. స్వదేశీ కంపెనీలతో పాటు విదేశీ కంపెనీలు ఇండియన్ మార్కెట్‌లో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యం కార్ మేకర్స్ కొత్త కొత్త మోడళ్లలో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. రానున్న 2025లో స్వదేశీ, విదేశీ కంపెనీల నుంచి కొత్త మోడల్ కార్లు రిలీజ్ కాబోతున్నాయి.
Kia Sonet facelift: కియా ఇండియా నుంచి కొత్త సోనెట్ ఫేస్‌లిఫ్ట్ రాబోతోంది. మిడ్ సైజ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కియా నుంచి సోనెట్ కూడా తన ప్రత్యర్థులకు ధీటుగా ఉంది. ఈ సెగ్మెంట్‌లో విపరీతమైన పోటీ ఉండటంతో దీన్ని తట్టుకునేందుకు కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో మరింత స్టైలిష్‌గా, అధునాతన ఫీచర్లతో రాబోతోంది. డిసెంబర్ 14న కొత్త సోనెట్‌ని ఆవిష్కరించనున్నారు. కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ డిసెంబర్ 14న ఆవిష్కరించబడుతుంది.
భారత కార్ మార్కెట్‌లో దక్షిణ కొరియా కంపెనీ కియా తన ముద్ర వేసుకొని దూసుకెళ్తోంది. సెల్టోస్, సోనెట్, కియా కారెన్స్ కంపెనీ ఫ్లీట్‌లోని అత్యుత్తమ కార్లలో ఒకటి నిలుస్తున్నాయి. ఇప్పుడు కంపెనీ భారతదేశంలోని హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌పై నజర్ పెట్టింది.
సాధారణంగా ఇయర్ ఎండింగ్‌లో కార్లపై భారీ ఆఫర్లు ఉంటాయి.. ఆ తర్వాత కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన తర్వాత వివిధ సంస్థలు.. వాటి కార్ల ధరలను పెంచడం చూస్తూనే ఉన్నాం.. అంటే, డిసెంబర్‌లో కొంటే.. సాధారణ ధరకంటే తక్కువకే కారు తీసుకునే అవకాశం ఉండగా.. క్యాలెండర్ మారిందంటే.. జేబుకు చిల్ల పడడం ఖాయం అన్నమాట.. తాజా, వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా కార్ల ధరలను పెంచనున్నట్టు చెబుతోంది.. జనవరి 23వ తేదీ నుంచి కార్ల ధరలను…
కొరియన్ కార్ల తయారీ సంస్థ ‘ కియా ’ ఇండియాలో అమ్మకాల్లో దుమ్మురేపుతోంది. ఎన్నడూ లేని విధంగా ఏడాది తొలి అర్థభాగంతో పాటు జూన్ నెలలో రికార్డ్ స్థాయిలో అమ్మకాలను నమోదు చేసిందని కియా ఇండియా ప్రకటించింది. జూన్ నెలలో ఏకంగా 24,024 యూనిట్ల కార్లను విక్రయించింది. 2021లో ఇదే నెలలో 15,015 కార్లను విక్రయించింది. గతేడాదితో పోలిస్తే దాదాపుగా 10 వేల యూనిట్లను అదనంగా విక్రయించింది. దాదాపు 60 శాతం గ్రోత్ నమోదు చేసింది. కియా…
దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ సంస్థ ఇండియాలోని అనంతపురం జిల్లాలో ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్లాంట్ నుంచి కియా కార్లను ఉత్పత్తి చేస్తున్నారు. కియా కార్లు ఇండియాలో ఫేమస్ కావడంతో కియా మోటార్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాలో కియా మోటార్స్ సంస్థ పేరును మార్చుకుంది. కియా మోటార్స్ ను కియా ఇండియాగా మార్చింది. లోగోలో కూడా ఈ మార్పులు చేసింది. ఇండియాలో ఉన్న డిస్ట్రిబ్యూటర్ల వద్ద కూడా క్రమపద్దతిలో…