Accident: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం ఓసి 2 సమీపంలో నేషనల్ హైవే పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఖమ్మం వైపు వెళ్తున్న లారీ ఢీ కొట్టింది..ఈ ప్రమాదంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ముందు క్యాబిన్ భాగం పూర్తిగా ధ్వంసం అయింది..బస్సు డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయి క్యాబిన్ లో ఇరుక్కుపోయ్యారు..మరో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావటంతో స్థానికులు సత్తుపల్లి ఆసుపత్రికి తరలించారు.
itel A90: కేవలం రూ.6,499కే 5000mAh బ్యాటరీ, IP54 రేటింగ్ లతో itel A90 భారత్‌లో లాంచ్!
బస్సు డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కు పోవటంతో వాహనాదారులు,డ్రైవర్లు కలిసి అర్దగంటకు పైగా శ్రమించి బస్సు డ్రైవర్ ను క్యాబిన్ నుండి బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు..ప్రమాద సమయంలో బస్సులో 20 ప్రయాణికులు ఉన్నారు….తల్లాడ టూ దేవరపల్లి జాతీయ రహదారి పై ఈ ప్రమాదం చోటు చేసుకోవటంతో ఇరువైపుల వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయింది….అయితే ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ను ఢీ కొట్టిన లారీ డ్రైవర్ లారీ ను అక్కడే వదిలేసి పరారు అయ్యాడు..పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Israel-Hamas: గాజాలో ఇజ్రాయెల్ బాంబుల మోత.. 80 మంది పౌరులు మృతి..!