Khammam train: రైల్వే స్టేషన్లలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కదులుతున్న ట్రైన్స్ ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు ప్రయాణికులు అదుపుతప్పి పడిపోవడం జరుగుతూ ఉంటాయి. ప్లాట్‌ఫాం పై నుంచి పట్టాలపై పడిపోవడం లాంటి ఘటనలు కూడా రైల్వే స్టేషన్లలో సర్వ సాధారణంగా మారుతున్నాయి. రైలు ఎక్కేప్పుడు లేదా దిగేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నా కానీ ప్రయాణికులు మాత్రం రైల్వే అధికారుల మాటలను పెడిచెవిన పెడుతుంటారు. అలా అని ప్రమాదానికి గురవుతుంటారు. రైలు కదిలేప్పుడు చాలా మంది ప్రయాణికులు హడావిడిగా ఎక్కేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఆ హడావిడే వారి జీవితాలకు హరించి వేస్తుందని మాత్రాం అలోచించరు. ఇలాంటి ఘటనే ఖమ్మంలో చోటుచేసుకుంది. ఆరోగ్యం భాగాలేక ఖమ్మంకు వచ్చిన జంటపై విధి వక్రీకరించింది. రైలు ఎక్కుతున్న భార్య భర్తలకు రైలు రూపంలో తీవ్ర విషాదాన్ని నింపింది. భర్త రైలు ఎక్కగా.. భార్య రైలు ఎక్కతున్న క్రమంలో రైలు కదిలింది దీంతో ఆమె కాలు కిందికి జారడంతో కాలు నుజ్జ నుజ్జ అయింది. అక్కడున్న పోలీసుల సహకారంతో ఆమె ప్రాణాలతో బయట పడింది.
మధిరకు చెందిన కల్యాణి, ఆమె భర్త నాగేశ్వరరావు ఆసుపత్రిలో చెకప్ నిమిత్తం ఖమ్మం వచ్చారు. పనులు ముగించుకుని తిరిగి మధిర వెళ్లేందుకు ఖమ్మం స్టేషన్ కు చేరుకున్నారు. అదే సమయంలో ఇంటర్‌సిటీ రైలు రావడంతో భర్త నాగేశ్వరరావు క్యారేజ్ ఎక్కాడు. వెనుక ఉన్న కళ్యాణి ఎక్కుతుండగానే రైలు ఒక్కసారిగా కదిలింది. ఆ సమయంలో కళ్యాణి బోగీ ప్లాట్‌ఫాం మధ్యలో ఉన్న గ్యాప్‌లోకి జారిపోయింది. కొందరు ప్రయాణికులు గమనించి వెంటనే చైన్ లాగి రైలును ఆపారు. కానీ రైలు ఆగడానికి 20 సెకన్లు పట్టింది. ఇంతలో కల్యాణికి నష్టం జరిగింది. ఆమె కాలు నుజ్జునుజ్జయింది. కల్యాణి చాలాసేపు అక్కడే ఏడ్చేసింది. తనను కాపాడాలని అక్కడున్న వారందరినీ వేడుకుంది. ప్రయాణికులు, సిబ్బంది పరుగున వచ్చి అతి కష్టం మీద ఆమెను బయటకు తీశారు. కల్యాణిని వెంటనే ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది.
Tirupathi: బస్సును ఢీ కొట్టిన కారు.. ముగ్గురు మృతి..