తెలంగాణకు తనకు ఉన్న బంధాన్ని సోనియమ్మ వెల్లడించారు అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మీరందరూ తనతో ఉంటారుగా అని హామీ తీసుకొని వెళ్లారు సోనియమ్మ.. ఆ హామీని మనం నెరవేర్చాలి.. అభ్యర్థులు ఎవరైనా మన గుర్తు హస్తం గుర్తు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. 6 డిక్లరేషన్లను ఖచ్చితంగా అమలు చ్చేస్తాం.. సీఎం కేసీఆర్ మాటలకే పరిమితమయ్యారు.. 60 రోజులో.. 65 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది.. ఇక్కడి బీఆర్ఎస్ నేతలు వందల కోట్లు అక్రమంగా దోచుకున్నారు.. వారిచ్చే అక్రమ డబ్బు తీసుకోండి కాంగ్రెస్ కు ఓటెయ్యండి అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
Read Also: Atchannaidu: చంద్రబాబుపై కేసు నూటికి లక్ష శాతం కక్ష సాధింపే.. ప్రాథమిక ఆధారాలు కూడా లేవు..!
మన దగ్గర పంచడానికి డబ్బు లేదు అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మనం ఇచ్చిన హామీలు అమలుకు సాధ్యం కాదంటారు.. వారిచ్చే హామీలు మాత్రం అమలుకు సాధ్యమని అంటుంనరు.. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేశారు.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకుందాం.. 10కి 10 సీట్లను మంచి మెజారిటీతో గెలిపించాలి అని పొంగులేటి కోరారు. ఖమ్మం జిల్లా అంటే ఉద్యమాలకు పూనాది అని శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్-బీజేపీ పార్టీలు ప్రజలకు మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారు.. వారికి తగిన బుద్ది చెప్పాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసి తీరుతామని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్-బీజేపీ దొంగ హామీలు నమ్మి మీరు మోసపోవద్దు అని ప్రజలను ఉద్దేశించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.