ఈ మధ్య కాలంలో తెలుగు తెరకు పరిచయమైన అందమైన హీరోయిన్లలో కేతిక ఒకరు. పూరీ జగన్నాథ్ బ్యానర్ నుంచి హీరోయిన్ వస్తే.. పూరీ మెచ్చిన అందం తప్పదని అందరూ అనుకుంటున్నారు. ఊహించినట్లుగానే ఈ బ్యూటీఫుల్ 'రొమాంటిక్' సినిమా ఫస్ట్ పోస్టర్ తోనే కుర్రాడి మనసు ఉలిక్కిపడేలా చేసింది.