తెలంగాణ విద్యా విధానం రూపకల్పన కోసం కమిటీ ఏర్పాటైంది. కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ విద్యా విధానం కమిటీ ఛైర్మన్‌గా ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేశవరావు ఎన్నికయ్యారు. కమిటీలో ఛైర్మన్ సహా మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు. కడియం శ్రీహరి, ఆకునూరి మురళీ, సీఎస్ రామకృష్ణారావు, విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ.బాల కిష్టారెడ్డి సభ్యులుగా ఉన్నారు. కమిటీ సభ్యులు: 1. డా. కేశవ…
K.Keshava Rao : తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు డీలిమిటేషన్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో పొలిటికల్ యూనిటీ (రాజకీయ ఏకీకరణ) గురించి అనేక ప్రయత్నాలు జరిగినప్పటికీ, ఇప్పటికీ వివాదం కొనసాగుతూనే ఉందని ఆయన పేర్కొన్నారు. చెన్నైలో ఇటీవల జరిగిన దక్షిణాది రాష్ట్రాల సమావేశం గురించి మాట్లాడుతూ, ఈ మీటింగ్‌కు తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతు ప్రకటించిందన్నారు. కే. కేశవరావు మాట్లాడుతూ, డీలిమిటేషన్ అనేది కేవలం పార్లమెంట్‌లో సీట్ల పెంపు గురించి కాదని, ప్రతి…
Elections for Rajya Sabha Posts: రాజ్యసభలో ఖాళీ ఐన స్థానాలకు తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో 9 రాష్ట్రాల్లో.. 12 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అస్సాం, బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర రాష్ట్రాల నుంచి 10 మంది సభ్యులు లోక్‌సభకు ఎన్నిక కావడంతో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. తెలంగాణ, ఒడిశా నుంచి ఒక్కొక్కరు తమ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి.…
బీఆర్ఎస్ భవన్ లో సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె .కేశవ రావు, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ.. జెండా మోసిన కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా.. ఉద్యమకారుల్లో ఉన్న అసంతృప్తిని గుర్తించాం.. వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుంది అని అన్నారు. కాగా.. తెలంగాణలో హైదరాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తలు హీరోలు అని పొగిడారు.