కేరళ ఆర్థిక సంక్షోభానికి కారణం మీరంటే మీరేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వమే కారణమని.. ప్రభుత్వం వృథా ఖర్చులు చేస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది. మరోవైపు రాష్ట్ర ఆర్థిక సంక్షోభానికి కేంద్ర విధానాలే కారణమని కేరళ ప్రభుత్వం ఆరోపిస్తుంది.
కాసర్గోడ్లోని శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయం ప్రత్యేకత గురించి అందరికి తెలిసిందే. దేశంలోనే అంతులేని సంపదకు ఇది చాలా ప్రసిద్ధి. ఆలయంలోని నేలమాళిగలల్లో రాశుల కొద్ది బంగారం, వజ్రవైఢ్యూర్యాలు, స్వర్ణ విగ్రహాలు ఉన్నాయనే ఓ వార్త ప్రచారంలో ఉంది.
CM Pinarayi Vijayan: కేరళలో పాలక సీపీఎం, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా పాలస్తీనా సంఘీభావం ర్యాలీలను చేపడుతున్నాయి. శనివారం కోజికోడ్ వేదికగా అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పాలస్తీనా మద్దతు ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో కేరళ సీఎం పినరయి విజయన్ పాల్గొన్నారు.
Kerala: కేరళలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. వరి ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం, డబ్బులు ఇవ్వకపోవడంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన దక్షిణ జిల్లాలోని కట్టనాడ్ ప్రాంతంలో శనివారం చోటు చేసుకుంది. వరి రైతు కేజీ ప్రసాద్ సూసైడ్ నోట్ రాసి.. తన ఆత్మహత్యకు రాష్ట్రప్రభుత్వం, కొన్ని బ్యాంకులు కారణమని ఆరోపించారు. ఈ ఆత్మహత్య కేరళలో పొలిటికల్ దుమారాన్ని రేపింది.
Congress: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం కేరళ రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. ఈ వివాదంపై ఇటు అధికార సీపీఎంతో పాటు కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా పాలస్తీనా కోసం సంఘీభావ ర్యాలీలు చేస్తున్నాయి. ఉగ్రదాడికి గురైన ఇజ్రాయిల్‌కి మద్దతు తెలుపకపోగా పాలస్తీనా, హమాస్‌కి మద్దతుగా ర్యాలీలు ఏంటని బీజేపీ ప్రశ్నిస్తోంది.
శనివారం రోజున రాహుల్ తన ఇంటిలో బెడ్రూంలో ఉరివేసుకుని ఉండటాన్ని అతని తల్లిదండ్రులు, స్నేహితులు గమనించారు. ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆస్పత్రి సిబ్బంది తమకు సమాచారం ఇచ్చిందని వారు వెల్లడించారు.
Relationship: చిన్న వయసులో సంబంధాలు పెట్టుకోవడం, తల్లిదండ్రుల మాట వినకపోవడంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇదిలా ఉంటే కొందరు తల్లిదండ్రులు వేరే కులానికి చెందిన వ్యక్తులను ప్రేమించారని కన్న కూతుళ్లను చంపడం కూడా చూస్తున్నాం. ఇటీవల కాలంలో కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాలో ఇలా పరువు హత్యలు చోటు చేసుకున్నాయి. కొన్ని సందర్భాల్లో తెలిసీ తెలియని వయసులో వేరే వ్యక్తిని ప్రేమించడం, వారితో సంబంధం కలిగి ఉండటం కూడా కూతుళ్ల హత్యలకు దారి తీస్తున్నాయి.
Kerala Bomb Blast: కేరళలోని కలమస్సేరిలో ‘యెహోవా విట్నెస్’ క్రైస్తవ సమూహం ప్రార్థనల సమయంలో వరసగా మూడు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ చర్యలో ఏదైనా ఉగ్రవాద కోణం ఉందా..? అని ఇప్పటికే ఎన్ఐఏ విచారణ జరుపుతోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఒకరు మరణించగా.. 45 మంది గాయపడ్డారు. నిమిషాల వ్యవధిలోనే మూడు పేలుళ్లు జరగాయని, పేలుళ్లలో ఐఈడీని టిఫిన్ బాక్సుల్లో అమర్చినట్లు పోలీసులు వెల్లడించారు.
Kerala Bomb Blasts: కేరళలోని కలమస్సేరిలోని కన్వెన్షన్ సెంటర్ లో ఈరోజు ఉదయం ఒక మతపరమైన కార్యక్రమంలో పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఒక మహిళ మరణించగా.. 45 మంది గాయపడ్డారు. ఈ పేలుళ్లు దేశ వ్యాప్తంగా సంచలనం రేపాయి. ప్రార్థనా సమయంలో కొన్ని నిమిషాల వ్యవధిలోనే మూడు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనపై ఎన్ఐఏతో పాటు కేరళ పోలీసులు విచారణ జరుపుతున్నారు.