Bank Manager Fraud: 26 కిలోల బంగారంతో ఉడాయించిన బ్యాంకు మేనేజర్..
- కోజికోడ్ జిల్లాలోని వడకర పోలీసులు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వడకర బ్రాంచ్ మాజీ బ్రాంచ్ మేనేజర్ పై కేసు నమోదు.
- తాకట్టు పెట్టిన 26 కిలోల బంగారంలో నకిలీ బంగారం ఉన్నట్లు విచారణలో తేలింది.
- బ్యాంకుకు దాదాపు రూ. 17 కోట్ల నష్టం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bank Manager Fraud: కొత్తగా బ్యాంకుకు వచ్చిన మేనేజర్ ఫిర్యాదు మేరకు కేరళలోని కోజికోడ్ జిల్లాలోని వడకర పోలీసులు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వడకర బ్రాంచ్ మాజీ బ్రాంచ్ మేనేజర్ పై కేసు నమోదు చేశారు. కొత్త మేనేజర్ ఇర్షాద్ తాకట్టు పెట్టిన బంగారాన్ని చూసే సరికి ఏదో తప్పు జరిగినట్లు అక్కడ గుర్తించారు. తాకట్టు పెట్టిన బంగారంలో నకిలీ బంగారం బయటపడింది. తదుపరి విచారణలో పెద్ద కుంభకోణం జరిగిందని తేలడంతో ఇర్షాద్ పోలీసులను ఆశ్రయించాడు. తమిళనాడు వాసి మధు జయకుమార్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వడకర బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేసి కొచ్చిలోని బ్రాంచ్‌కి బదిలీ అయ్యారు. బదిలీ అనంతరం ఇర్షాద్ బాధ్యతలు చేపట్టారు.
Medical Services: నేడు దేశవ్యాప్తంగా వైద్యసేవలు బంద్..
Also Read
- Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
- UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
- CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత కూడా జయకుమార్ తన కొత్త పోస్టింగ్ కు రాలేదు. అప్పటికి ఇర్షాద్ కు తనఖా పెట్టిన బంగారంలో ఎన్నో తీవ్రమైన వైరుధ్యాలు కనుగొనబడ్డాయి. బ్యాంకులో తాకట్టు పెట్టిన 26 కిలోల బంగారంలో నకిలీ బంగారం ఉన్నట్లు విచారణలో తేలింది. దింతో బ్యాంకుకు దాదాపు రూ. 17 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. జయకుమార్ మొబైల్ స్విచ్ ఆఫ్ లో ఉండడంతో అతని ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఇంత పెద్ద మోసం ఒక్క వ్యక్తి ద్వారా ఎలా సాధ్యమైందని పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వడకర శాఖలోని ఉద్యోగులందరి వాంగ్మూలాలను పోలీసులు త్వరలో నమోదు చేయనున్నారు.
Sabarmati Express: కాన్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్..
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!